పేదలకు రిలీఫ్ ఏదీ ? కాంగ్రెస్ నేత శశిథరూర్

దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను తాను సమర్థిస్తున్నానని, అయితే పేదల సంక్షేమం కోసం ఆయన ఏవైనా సహాయక చర్యలు ప్రకటించాల్సి ఉండిందని....

పేదలకు రిలీఫ్ ఏదీ ? కాంగ్రెస్ నేత శశిథరూర్

Edited By:

Updated on: Apr 14, 2020 | 12:08 PM

దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను తాను సమర్థిస్తున్నానని, అయితే పేదల సంక్షేమం కోసం ఆయన ఏవైనా సహాయక చర్యలు ప్రకటించాల్సి ఉండిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. రాష్ట్రాలకు జీ ఎస్టీ బకాయిలు, జన ధన్ అకౌంట్స్, ఇతర ప్రయోజనాల గురించిన ప్రస్తావన మోదీ ప్రసంగంలో లేవని శశిథరూర్ తన  ట్వీట్ లో ఆరోపించారు. ఇలా ఉండగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ని పొడిగించాలని రాష్ట్రాలు కోరినప్పటికీ.. మోడీ ఓ చిన్న చమత్కృతిని ‘వాడినట్టు కనిపిస్తోంది’ ఇందుకు ఉదాహరణగా మే 1 వ తేదీ కార్మిక దినోత్సవం.. ప్రభుత్వ సెలవు దినం కాగా… మే 2 శనివారం, మే 3 వ తేదీ ఆదివారం అయ్యాయి. ఈ సెలవు రోజులను ఆయన పరోక్షంగా లాక్ డౌన్ పొడిగింపులో కలిపేశారు. .

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us