భ‌క్తుల‌కు అలెర్ట్.. ఈ నెల 21న బెజ‌వాడ‌ దుర్గమ్మ ఆలయం మూసివేత..

జూన్ 21 న గ్రహణం కారణంగా బెజ‌వాడ దుర్గమ్మ ఆలయం మూసివేయ‌నున్నారు అధికారులు. 20 వ‌ తేదీ సాయంత్రం అమ్మ‌వారికి పంచ హారతులు ఇచ్చిన అనంత‌రం గుడిని మూసివేస్తారు.

భ‌క్తుల‌కు అలెర్ట్.. ఈ నెల 21న బెజ‌వాడ‌ దుర్గమ్మ ఆలయం మూసివేత..
Follow us

|

Updated on: Jun 18, 2020 | 4:03 PM

జూన్ 21 న గ్రహణం కారణంగా బెజ‌వాడ దుర్గమ్మ ఆలయం మూసివేయ‌నున్నారు అధికారులు. 20 వ‌ తేదీ సాయంత్రం అమ్మ‌వారికి పంచ హారతులు ఇచ్చిన అనంత‌రం గుడిని మూసివేస్తారు. మరలా గ్రహణాంతరం 21 న మధ్యాహ్నం 2.30 నిముషాలకు తలుపులు తెరిచి ఆలయాన్ని శద్దిప‌రుస్తారు. అనంత‌రం ప్రధానాలయ, ఉపాలయముల దేవతామూర్తులకు స్నాపనాది కార్యక్రమాల నిర్వర్తిస్తారు అర్చ‌కులు. అదే రోజు సాయంత్రం అమ్మ‌వారికి పంచ హారతులు నిర్వహించి ఆలయం మూసివేస్తారు. తిరిగి 22 తేదీన ఉదయం 6 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించ‌నున్నారు. ఈ మేర‌కు దుర్గగుడి ఈవో సురేష్ బాబు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇవే కాదు రాష్ట్రంలోని తిరుమ‌ల‌, అన్న‌వ‌రం వంటి ప్ర‌ముఖ‌ దేవాల‌యాలను కూడా గ్ర‌హ‌ణం రోజు మూసివేయ‌నున్నారు.

కాగా క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల్లో జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ద‌ర్శ‌నాలు జ‌రిగేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించ‌డంతో పాటు మాస్కును త‌ప్ప‌నిస‌రి చేశారు. క్యూలైన‌ల్లో కూడా దూరం పాటించేలా నియామావ‌ళి సిద్దం చేశారు.