ప్ర‌భాస్ పాటకు జెనీలియా స్టెప్పులు..దుమ్ములేచిపోయింది..

'ఢీ', 'బొమ్మరిల్లు' చిత్రాల‌లో అల్లరి పాత్ర‌లు చేసి తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగా ద‌గ్గ‌రైంది‌ అందాల తార జెనీలియా. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ సుంద‌రాంగి..ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయింది.

ప్ర‌భాస్ పాటకు జెనీలియా స్టెప్పులు..దుమ్ములేచిపోయింది..
Follow us

|

Updated on: Jun 12, 2020 | 6:13 PM

‘ఢీ’, ‘బొమ్మరిల్లు’ చిత్రాల‌లో అల్లరి పాత్ర‌లు చేసి తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగా ద‌గ్గ‌రైంది‌ అందాల తార జెనీలియా. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ సుంద‌రాంగి..ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయింది. తన భర్త రితేశ్ దేశ్‌ముఖ్‌, పిల్ల‌ల‌తో క‌లిసి ఉన్న ఫోటోలు, వీడియోల‌ను నెటిజ‌న్ల‌తో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల‌వుతుంది‌. ‘బాహుబలి..ది బిగినింగ్’ మూవీలోని మనోహరి పాటను డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టింది. ఇసుక‌లో జెనీలియా వేస్తోన్న స్టెప్పుల‌కు దుమ్ములేచిపోయింది

‘హ్యాపీగా ఉన్నపుడు డ్యాన్స్ చేయండి..’ అంటూ క్యాప్షన్ పెట్టింది జెనీలియా. దీంతో నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలు కామెంట్స్ పెడుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఎప్పుడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భాస్ ప‌క్క‌న మిమ్మ‌ల్ని చూడాల‌ని ఉందంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. మరి ఈ అల్ల‌రి పిల్ల మ‌ళ్లీ తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

View this post on Instagram

When happy … Dance !!!

A post shared by Genelia Deshmukh (@geneliad) on