క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌.. ప్రారంభమైన షూటింగ్‌

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌.. ప్రారంభమైన షూటింగ్‌

మెగాస్టార్‌ మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొదటి సినిమా విడుదల కాకముందే రెండో సినిమాను ప్రారంభించేశారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 4:00 PM

Vaishnav Tej- Krish movie: మెగాస్టార్‌ మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొదటి సినిమా విడుదల కాకముందే రెండో సినిమాను ప్రారంభించేశారు. స్టార్ దర్శకుడు క్రిష్‌, వైష్ణవ్‌ రెండో మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో వైష్ణవ్ సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మూవీ షూటింగ్‌ ఇవాళ ప్రారంభమైంది. కోవిడ్‌ 19 నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు క్రిష్‌. 40 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా ఈ మూవీ షూటింగ్ జరగనుండగా, అక్టోబర్‌ మొదటి వారానికి పూర్తి కానుంది. అక్టోబర్ చివర్లో గానీ, నవంబర్‌లో గానీ ఈ మూవీని విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో క్రిష్ విరూపాక్షిని ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇక ప్రస్తుతం పవన్‌, చాతుర్మాస దీక్షలో ఉండగా.. మరో రెండు, మూడు నెలల వరకు ఆయన సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు. ఈ మధ్యలో పవన్ మేనల్లుడితో క్రిష్‌ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత మళ్లీ పవన్‌తో ఆయన సెట్స్‌ మీదకు వెళ్లనున్నారు. మొత్తానికి సమయాన్ని వృధా చేయకుండా క్రిష్ బాగా ప్లాన్ చేసుకున్నారు.

కాగా వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి చిత్రం ‘ఉప్పెన’ ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మధ్యలో పలు సినిమాలు ఓటీటీలో విడుదల అయినప్పటికీ., ఉప్పెన మేకర్లు మాత్రం అందుకు సిద్ధంగా లేరని సమాచారం.

Read More:

ఆగష్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

దిశ ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu