దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ్యాన్ చేసిన తొలి గ్రామం ఇదే…

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 4:33 PM

స‌రిహ‌ద్దు విష‌యంలో భారత్-చైనాల మ‌ధ్య ఉద్రిక ప‌రిస్థితులు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయ్ కాట్ చైనా ప్రొడ‌క్ట్స్ అనే నినాదం ఇప్పుడు గ‌ట్టిగా వినిపిస్తోంది.

దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ్యాన్ చేసిన తొలి గ్రామం ఇదే...
Follow us on

స‌రిహ‌ద్దు విష‌యంలో భారత్-చైనాల మ‌ధ్య ఉద్రిక ప‌రిస్థితులు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయ్ కాట్ చైనా ప్రొడ‌క్ట్స్ అనే నినాదం ఇప్పుడు గ‌ట్టిగా వినిపిస్తోంది. చైనా వ‌స్తువుల వినియోగాన్ని నిషేధించాల‌ని పెద్ద ఎత్తున ప్రచారం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో చైనా వస్తువులపై ఓ గ్రామం బ్యాన్ విధించింది. పూణేలోని కొండ్వే-ధావాడే గ్రామం చైనా ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లను నిషేధించాలని తీర్మానం చేసింది. జూలై 1 నుంచి ఆ గ్రామంలో చైనా ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ తీర్మానాన్ని గ్రామ పంచాయతీ నేతృత్వంలోని సభ్యులు బృందం ఆమోదించింది. చైనా ఉత్పత్తులను ఏ దుకాణ యజమాని విక్రయించరాదని స్పష్టం చేసింది. వ‌స్తువులు కొనుగోలు చేసేటప్పుడు గ్రామస్తులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించింది.

దీనికి సంబంధించి గ్రామంలోని దుకాణ యజమానులకు ఒక సర్క్యులర్‌ను విడుదల చేశారు గ్రామ పంచాయతీ సభ్యులు. ఈ మేర‌కు కొండ్వే-ధావడే గ్రామానికి చెందిన సర్పంచ్ నితిన్ ధ్వాడే వివ‌రాల‌ను వెల్ల‌డించారు.