మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు? : దేవినేని ఉమ

మద్యం టెండర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తప్పుబట్టారు. ‘మద్యం రవాణాలో అస్మదీయులకు కోట్లు కట్టబెట్టేలా టెండర్? గతంలో పెట్ కు 18 రూపాయలు. ఇప్పుడు 30 పైనే కోట్, మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు? రాష్ట్రమంతా ఒక్కరికే ఎలా ఇస్తారు? అనామక బ్రాండ్లు, నాసిరకం మద్యం తోపాటు రవాణాలోనూ జరుగుతున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి’ అని […]

మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు? : దేవినేని ఉమ

Updated on: Sep 29, 2020 | 11:09 AM

మద్యం టెండర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తప్పుబట్టారు. ‘మద్యం రవాణాలో అస్మదీయులకు కోట్లు కట్టబెట్టేలా టెండర్? గతంలో పెట్ కు 18 రూపాయలు. ఇప్పుడు 30 పైనే కోట్, మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు? రాష్ట్రమంతా ఒక్కరికే ఎలా ఇస్తారు? అనామక బ్రాండ్లు, నాసిరకం మద్యం తోపాటు రవాణాలోనూ జరుగుతున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి’ అని ఉమ డిమాండ్ చేశారు. ఈమేరకు ట్వీట్ చేసిన ఆయన ఒక పత్రికలో ఈ అంశం గురించి వచ్చిన వార్త క్లిప్పింగ్ ను ఉంచి పోస్ట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us