మావోల మృతదేహాలను భద్రపరచండి… హైకోర్టు ఆదేశం

చర్ల ఎన్‌కౌంటర్‌పై కొనసాగుతున్న వివాదం కీలక దశకు చేరుకుంది. రీపోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారి చేసింది. అంతవరకు మూడు మృతదేహాలను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజ్ చేయాలని నిర్దేశించింది.

మావోల మృతదేహాలను భద్రపరచండి... హైకోర్టు ఆదేశం
Follow us

|

Updated on: Sep 24, 2020 | 4:18 PM

చర్ల ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు మావోయిస్టు తీవ్రవాదుల మృతదేహాలను భద్రాద్రి-కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచాలని హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయించాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోస్ట్ మార్టం మొత్తం వీడియోగ్రఫీ చేయించి రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది హైదరాబాద్ హైకోర్టు.

చర్ల ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు మావోయిస్టు నక్సల్స్ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించాలంటూ న్యాయవాది రఘునాథ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది. పోలీసులపై 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అంతవరకు మృతదేహాలను భద్రపరచాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మూడు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలను తిరిగి తెప్పించి, భద్రాద్రి-కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Latest Articles
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?