మాస్‌ రాజా కూడా స్టార్ట్‌ చేసేశాడు

| Edited By:

Oct 07, 2020 | 10:09 AM

లాక్‌డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రంగాలు తమ పనులను ప్రారంభించేశాయి. ఈ క్రమంలో

మాస్‌ రాజా కూడా స్టార్ట్‌ చేసేశాడు
Follow us on

Ravi Teja Krack movie: లాక్‌డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రంగాలు తమ పనులను ప్రారంభించేశాయి. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితమైన సినిమా వాళ్లు కూడా కదులుతున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సెట్స్‌పైకి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో  ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు తమ షూటింగ్‌లను ప్రారంభించేయగా.. ‌మంగళవారం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు రాజమౌళి.

ఇక తాజాగా మాస్‌ రాజా రవితేజ సెట్స్‌పైకి వెళ్లారు. ప్రస్తుతం రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. కాగా క్రాక్‌కి సంబంధించి కొంత భాగం మాత్రమే షూటింగ్ మిగిలి ఉండగా.. ఆ షూటింగ్‌ త్వరలోనే పూర్తి కానుంది. ఆ తరువాత మూవీ యూనిట్ ప్రమోషన్లను ప్రారంభించనుంది. కాగా అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 50 శాతం సీట్లతో థియేటర్లు తెరుచుకోనుండగా.. క్రాక్‌, థియేటర్‌లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,154 కొత్త కేసులు.. 8 మరణాలు

నేను అలా చెప్పేలేదు.. పవన్ ‘గబ్బర్‌సింగ్’‌ నా లైఫ్‌ని మార్చిన మూవీ..!