హైకోర్టుకు రఘునందన్..గెలిచిన రెండ్రోజులకే కోర్టు మెట్లెక్కిన దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట సంఘటనలో కేసు కొట్టివేయాలని అభ్యర్థన

హైకోర్టుకు రఘునందన్..గెలిచిన రెండ్రోజులకే కోర్టు మెట్లెక్కిన దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట సంఘటనలో కేసు కొట్టివేయాలని అభ్యర్థన

దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన మాధవనేని రఘునందన్ రావు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఉపఎన్నికల పర్వంలో సంచలన విజయం సాధించిన రఘునందన్ రావు.. గెలిచిన రెండ్రోజులకే హైకోర్టుకెక్కడం చర్చనీయాంశమైంది.

Rajesh Sharma

| Edited By: Ravi Kiran

Nov 13, 2020 | 9:19 AM

Raghunandan approached High court: దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన మాధవనేని రఘునందన్ రావు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఉపఎన్నికల పర్వంలో తనపై కట్టుకథ అల్లి మరీ కేసు పెట్టారని, ఆ కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థిస్తూ గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 26వ తేదీ.. విజయదశిమి మరునాడు సిద్దిపేటలోని రఘునందన్ రావు బంధువు ఇంట్లో 18 లక్షల రూపాయలు దొరికాయంటూ పోలీసులు రాగా.. పెద్ద గందరగోళం ఏర్పడిన విషయం విధితమే.

18 లక్షల రూపాయలు లభించాయంటూ పోలీసులు కట్టుకథ అల్లారని ఆరోపిస్తున్న రఘునందన్ రావు.. అక్రమంగా నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు. కాగా రఘునందన్ రావు పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మీదకు విచారణకు వచ్చింది. అయితే.. ఎమ్మెల్యేలపై నమోదయ్యే కేసులను ప్రధాన న్యాయమూర్తి ప్రాతినిధ్యం వహించే ధర్మాసనం విచారించాల్సి వుంటుందన్న కారణంతో రఘునందన్ రావు పిటిషన్‌కు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని జస్టిస్ లక్ష్మణ్ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

రూ.18 లక్షలు లభించాయని కట్టు కథ అల్లారని పిటిషన్ లో పేర్కొన్న రఘునందన్ రావు.. దాని ఆధారంగా నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను న్యాయమూర్తి లక్ష్మణ్ ఆదేశించడంతో శుక్రవారం ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ సారథ్యం వహించే ధర్మాసనం ముందుకు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ALSO READ: ‘చేయూత‘కు 151 కోట్లు.. మంజూరు చేసిన సర్కార్

ALSO READ: ఆర్థిక ప్రగతికి 12 కీలక నిర్ణయాలు.. వెల్లడించిన నిర్మల

ALSO READ: కొండ చిలువకు సర్జరీ.. స్నేక్ క్యాచర్ ఔదార్యం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu