శ్రీవారి దర్శనానికి అదొక్కటే అడ్డు..!

|

May 28, 2020 | 4:46 PM

తిరుమల శ్రీవారి దర్శనాలను పున: ప్రారంభించేందుకు అదొక్కటే అడ్డు అని చెబుతున్నారు టీటీడీ బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి. ఆ అడ్డు గనక తొలిగితే ఆ వెంటనే శ్రీవారి దర్శనాలను ప్రారంభిస్తామని టీటీడీ ట్రస్టు బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం ప్రకటించారు.

శ్రీవారి దర్శనానికి అదొక్కటే అడ్డు..!
Follow us on

తిరుమల శ్రీవారి దర్శనాలను పున: ప్రారంభించేందుకు అదొక్కటే అడ్డు అని చెబుతున్నారు టీటీడీ బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి. ఆ అడ్డు గనక తొలిగితే ఆ వెంటనే శ్రీవారి దర్శనాలను ప్రారంభిస్తామని టీటీడీ ట్రస్టు బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం ప్రకటించారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తొలుత పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారిి దర్శనాలకు ఆనుమతిస్తామని ఆయనంటున్నారు.

‘‘ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన వెంటనే భక్తులని దర్శనాలకి అనుమతిస్తాము.. భక్తులు ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామా..అని ఆశగా ఎదురు చూస్తున్నారు.. మేము కూడా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాము.. అయితే లాక్‌డౌన్ నిబంధనలే శ్రీవారి దర్శనాలను పున:ప్రారంభించేందుకు అడ్డు.. ఇవాళ (గురువారం) తిరుమలలో దర్శనాల ఏర్పాట్లని నేనే స్వయంగా పరిశీలించాను.. కేంద్రం, రాష్ట్రం నుంచి అనుమతి రాగానే భక్తులని దర్శనాలకు అనుమతిస్తాము.. ’’ అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదిలా వుండగా దశల వారీగా తిరుమలేశుని దర్శనాలను పున: ప్రారంభించాలని టీటీడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత తిరుపతిలోని స్థానిక భక్తులకు పరిమిత సంఖ్యలో కరోనా జాగ్రత్తలను పాటిస్తూ దర్శనాలను ప్రారంభించి.. ఆ తర్వాత క్రమంగా విస్తరించేందుకు టీటీడీ సిద్దమవుతున్నట్లు సమాచారం.