జగన్‌ను నాగార్జున కలిసింది అందుకేనట..

హైదరాబాద్: వైఎస్ జగన్‌తో అక్కినేని నాగార్జున భేటీ కావడం సంచలనంగా మారింది. నాగార్జున రాజకీయాల్లోకి వస్తున్నారా? లేక ఎవరి కోసమైనా టిక్కెట్ సిఫారసు చేయడానికి కలిశారా? అనే చర్చలు సాగుతున్న క్రమంలో స్వయంగా నాగార్జునే క్లారిటీ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. జగన్‌ తమకు బంధువని, అందుకే మర్యాద పూర్వకంగా కలిశామే కానీ వేరే ఇతర కారణాలు లేవని చెప్పారట. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశము తనకు లేదని, ఎవరికీ రికమెండే చేయలేదని నాగార్జున అన్నట్టు వినిపిస్తోంది. అయితే జగన్ విజయవంతంగా […]

జగన్‌ను నాగార్జున కలిసింది అందుకేనట..

Edited By:

Updated on: Oct 18, 2020 | 7:47 PM

హైదరాబాద్: వైఎస్ జగన్‌తో అక్కినేని నాగార్జున భేటీ కావడం సంచలనంగా మారింది. నాగార్జున రాజకీయాల్లోకి వస్తున్నారా? లేక ఎవరి కోసమైనా టిక్కెట్ సిఫారసు చేయడానికి కలిశారా? అనే చర్చలు సాగుతున్న క్రమంలో స్వయంగా నాగార్జునే క్లారిటీ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి.

జగన్‌ తమకు బంధువని, అందుకే మర్యాద పూర్వకంగా కలిశామే కానీ వేరే ఇతర కారణాలు లేవని చెప్పారట. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశము తనకు లేదని, ఎవరికీ రికమెండే చేయలేదని నాగార్జున అన్నట్టు వినిపిస్తోంది. అయితే జగన్ విజయవంతంగా పాదయాత్రను ముగించుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపేందుకే నాగార్జున కలిశారట.

ఇదిలా ఉంటే నాగార్జున కలిసిన వెంటనే గుంటూరు ఎంపీ టిక్కెట్ కోసం ఎవరినో సిఫారసు చేసేందుకే కలిశారని కొన్ని వార్తలొచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోను చాలా కాలంగా నిర్వహిస్తోన్న వెంకటేశ్వరరావును రికమెండ్ చేసినట్టు, ఒకవేళ కుదరకపోతే మరో వ్యాపారవేత్తకు టిక్కెట్ ఇవ్వాలని నాగార్జున అడిగినట్టు ఊహాగానాలు చెలరేగాయి. ఎన్నికల ముందు కావడంతో వైఎస్ జగన్‌ను ఎవరు కలిసినా అది సంచలనంగా మారుతోంది.

Follow Us