పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు.. పాకిస్థాన్ అన్న జీవీఎల్

విజయవాడ : కర్నూలు సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇవాళ విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడ్డారు. పీకే అంటే మనం పవన్ కల్యాణ్ అనుకుంటాం, కానీ పీకే అంటే జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌ కోడ్‌ అనుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు ఒప్పందం కుదిరిందా.. అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్ మాటలను పాకిస్థాన్‌ పత్రికలు వాడుకుంటున్నాయని, […]

పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు.. పాకిస్థాన్ అన్న జీవీఎల్

Edited By:

Updated on: Mar 02, 2019 | 12:28 PM

విజయవాడ : కర్నూలు సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇవాళ విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడ్డారు. పీకే అంటే మనం పవన్ కల్యాణ్ అనుకుంటాం, కానీ పీకే అంటే జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌ కోడ్‌ అనుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు ఒప్పందం కుదిరిందా.. అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్ మాటలను పాకిస్థాన్‌ పత్రికలు వాడుకుంటున్నాయని, రాజకీయాల్లోకి జాతీయ భద్రతను లాగొద్దన్నారు. రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని, అధికార దాహం కోసం జాతీయ భద్రతను దెబ్బతీసే వ్యాఖ్యలు పవన్ చేయొద్దని జీవీఎల్ సూచించారు.