కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని సవరించడంపై కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలను అనేక అంశాలపై చైతన్యవంతం చేస్తున్న సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఆ చట్టానికి కేంద్రంలోని మోడీ సర్కారు సవరణలను ప్రతిపాదిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శనివారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో ప్రభుత్వంపైనా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పుకునేవారిపైనా మండిపడ్డారు.
‘‘అవినీతిపరులు భారత దేశం నుంచి దోచుకోవడానికి వీలుగా సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. సాధారణంగా పెద్ద గొంతుతో నినదించే అవినీతి వ్యతిరేక యోధులు అకస్మాత్తుగా అదృశ్యమైపోవడం ఆశ్చర్యకరం’’ అని రాహుల్ పేర్కొన్నారు.
సమాచార హక్కు సవరణ బిల్లు, 2019ను గురువారం రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిని త్వరలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.
Government is diluting RTI in order to help the corrupt steal from India. Strange that the normally vociferous anti-corruption crowd has suddenly disappeared. #GovtMurdersRTI
— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2019