#DubbakBypoll-రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది.

#DubbakBypoll-రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు
Follow us

|

Updated on: Nov 10, 2020 | 4:11 PM

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నువ్వా? నేనా? అన్నట్టుగా సాగింది. మొదటి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం కనబర్చారు. అయితే 6,7,10,13, 14, 15 రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఆధిక్యతంలోకి వచ్చారు. బీజేపీ మెజారిటీ కాస్త తగ్గింది. చివరి 20,21 రౌండ్లలో బీజేపీ మరోసారి పుంజుకుని అధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా నరాలు తెగే ఉత్కంఠగా సాగిన దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

దుబ్బాకలో మొత్తం ఓటర్లు – 1,98,807 పోలైన ఓట్లు – 1,64,192 లెక్కించిన ఓట్లు : 1,62,516

23 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత పార్టీల బలాబలాలు : బీజేపీ – 63,140 టీఆర్ఎస్ – 62,022 కాంగ్రెస్ – 21,961 నోటా -552 మెజారిటీ ఓట్లు 1,118 (బీజేపీ విజయం)

రౌండ్ల వారీగా ఓట్లను ఓసారి చూద్దాం…

రౌండ్  టీఆర్ఎస్  బీజేపీ  అధిక్యం ఓట్లు పార్టీ 
1 2867 3208 341 బీజేపీ
2 2490 3284 794 బీజేపీ
3 2607 2731 124 బీజేపీ
4 2407 3832 1425 బీజేపీ
5 3126 3462 336 బీజేపీ
6 4062 3709 353 టీఆర్ఎస్
7 2718 2536 182 టీఆర్ఎస్
8 2495 3116 621 బీజేపీ
9 2329 3413 1084 బీజేపీ
10 2948 2492 456 టీఆర్ఎస్
11 2766 2965 199 బీజేపీ
12 1900 1997 97 బీజేపీ
13 2824 2520 304 టీఆర్ఎస్
14 2537 2249 288 టీఆర్ఎస్
15 3027 2072 955 టీఆర్ఎస్
16 3157 2408 749 టీఆర్ఎస్
17 2818 1946 872 టీఆర్ఎస్
18 3215 2527 688 టీఆర్ఎస్
19 2760 2335 425 టీఆర్ఎస్
20 2440 2931 491 బీజేపీ
21 2048 2428 380 బీజేపీ
22 2520 2958 438 బీజేపీ
23 1241 1653 412 బీజేపీ
మొత్తం  61,302 62,772 1,470 బీజేపీ
పోస్టల్ ఓట్లు 720 368 352 టీఆర్ఎస్
మొత్తం  62,022 63,140 1,118 బీజేపీ