సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి. రాజా

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నేత రాజా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకరరెడ్డి అనారోగ్య కారణాల రీత్యా బాధ్యతలను నుంచి తప్పుకుంటానని పార్టీ కమిటీకి తెలిపారు. ఈనేపథ్యంలోనే ఆ బాధ్యతలు వేరొకరికి ఇచ్చేందుకు పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. మరోవైపు ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన జాతీయ మండలి కార్యవర్గ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈసమావేశాల్లోనే రాజా పేరును ప్రకటించనున్నారు. డి. రాజా రాజ్యసభ సభ్యునిగా అనేక అనేక సందర్భాల్లో […]

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి. రాజా

Edited By:

Updated on: Jul 20, 2019 | 6:06 AM

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నేత రాజా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకరరెడ్డి అనారోగ్య కారణాల రీత్యా బాధ్యతలను నుంచి తప్పుకుంటానని పార్టీ కమిటీకి తెలిపారు. ఈనేపథ్యంలోనే ఆ బాధ్యతలు వేరొకరికి ఇచ్చేందుకు పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. మరోవైపు ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన జాతీయ మండలి కార్యవర్గ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈసమావేశాల్లోనే రాజా పేరును ప్రకటించనున్నారు.

డి. రాజా రాజ్యసభ సభ్యునిగా అనేక అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తారు. ఆయనకు జాతీయ రాజకీయాల్లో మంచి పేరుంది. ఈ పరిస్థితిలో ఆయన పార్టీ బలోపేతానికి తగిన విధంగా కృషిచేయగలరని పార్టీ కమిటీ భావిస్తోంది.