క‌స్ట‌మ‌ర్ ఉదార‌త‌.. వెయిట‌ర్‌కి రూ.75 వేల టిప్

| Edited By:

Jul 12, 2020 | 12:51 PM

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం మొత్తం స్తంభించి పోయింది. ఆర్థిక వ్య‌వ‌స్థ మొత్తం చిన్నాభిన్న‌మై పోయింది. దాదాపు కొన్ని నెల‌ల పాటు షాపింగ్ మాల్స్‌, హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, మూవీ థియేట‌ర్స్, షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌పంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాయి ఆయా దేశాలు. అయితే ఈ లాక్ డౌన్ కార‌ణంగా దేశాలు...

క‌స్ట‌మ‌ర్ ఉదార‌త‌.. వెయిట‌ర్‌కి రూ.75 వేల టిప్
Follow us on

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం మొత్తం స్తంభించి పోయింది. ఆర్థిక వ్య‌వ‌స్థ మొత్తం చిన్నాభిన్న‌మై పోయింది. దాదాపు కొన్ని నెల‌ల పాటు షాపింగ్ మాల్స్‌, హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, మూవీ థియేట‌ర్స్, షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌పంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాయి ఆయా దేశాలు. అయితే ఈ లాక్ డౌన్ కార‌ణంగా దేశాలు ఆర్థికంగా న‌ష్ట‌పోయాయి. దీంతో కొద్దిపాటి మినహాయింపులతో హోట‌ల్స్, షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయ‌డానికి ప్ర‌భుత్వాలు అనుమ‌తిని ఇచ్చాయి. దీంతో మ‌ళ్లీ హోట‌ల్స్ తెరుచుకున్నాయి. ప‌లు నిబంధ‌నలు అనుస‌రిస్తూ.. వ్యాపారులు హోట‌ల్స్ తెరిచినా.. క‌స్ట‌మ‌ర్లు స‌రిగ్గా వెళ్ల‌డం లేదు. దీంతో ప‌లు హోట‌ల్స్ అండ్ రెస్టారెంట్ య‌జ‌మానులు ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. వారికి కూడా క‌రోనా సోకే ప్ర‌మాదం ఉన్నా స‌రే.. వారి బాధ్య‌త‌ల మేర‌కు తెగించి ప‌ని చేస్తున్నారు.

తాజాగా అలాంటి వాళ్ల‌కు ఎంత ఇచ్చినా త‌క్కువే అంటూ ఓ ఓ క‌స్ట‌మ‌ర్ రూ.75 వేల‌ను టిప్‌గా ఇచ్చాడు. 2001 నుంచి రెగ్యుల‌ర్‌గా ఆ హోట‌ల్‌కి వెళ్తున్న ఆ క‌స్ట‌మ‌ర్ తాజాగా ఫ్యామిలీతో వెళ్లారు. కావాల్సిన‌వి తిన్న త‌ర్వాత వెయిట‌ర్ బిల్ తీసుకువ‌చ్చి ఇచ్చాడు. ఆ బిల్లులో టిప్ ప్లేస్‌లో వెయ్యి డాల‌ర్లు ఇస్తున్న‌ట్లు రాయ‌డంతో ఆ వెయిట‌ర్ దాన్ని చూసి ఆనందంతో కేక పెట్టాడు. అది చూసిన య‌జ‌మాని ఏంట‌ని అడ‌గ‌క‌.. ఆ బిల్లు చూపించి తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యాడు వెయిట‌ర్. ఈ సంద‌ర్భంగా హోట‌ల్ య‌జ‌మాని మాట్లాడుతూ.. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆ టిప్ప‌ర్ మా హోట‌ల్‌కి వ‌స్తూంటారు. కాగా ఆ క‌స్ట‌మ‌ర్ పేరు బ‌య‌ట పెట్ట‌వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లు  హోట‌ల్ య‌జ‌మాని తెలిపాడు. ఈ మేర‌కు ఆ బిల్లును ఫొటో తీసి ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది.

Read More: 

మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్.. రూ.15 లక్షలు గెలుచుకున్న ఏపీ విద్యార్థి..