ప్రభాస్‌ బుగ్గ గిల్లి వెళ్లిపోయింది

| Edited By:

Mar 05, 2019 | 3:29 PM

అభిమాన నటీనటులు ఎదురుగా కనిపిస్తే అస్సలు ఒక్క క్షణం కూడా ఆగలేము. మన ఉత్సాహం కొద్ది పలకరించి ఓ ఫొటో అయినా తీసుకుంటాం. అయితే ఓ యువతి మాత్రం ఏకంగా ప్రభాస్ బుగ్గను గిల్లి గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. See more ‘సాహో’ షూటింగ్‌లో భాగంగా ఇటీవల లాస్‌ ఏంజిల్స్‌కు వెళ్లాడు ప్రభాస్. అక్కడి ఎయిర్‌పోర్టులో ప్రభాస్ వెళుతుండగా.. అటుగా వస్తోన్న ఓ యువతి అతడితో ఫొటో తీసుకునేందుకు […]

ప్రభాస్‌ బుగ్గ గిల్లి వెళ్లిపోయింది
Follow us on

అభిమాన నటీనటులు ఎదురుగా కనిపిస్తే అస్సలు ఒక్క క్షణం కూడా ఆగలేము. మన ఉత్సాహం కొద్ది పలకరించి ఓ ఫొటో అయినా తీసుకుంటాం. అయితే ఓ యువతి మాత్రం ఏకంగా ప్రభాస్ బుగ్గను గిల్లి గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

‘సాహో’ షూటింగ్‌లో భాగంగా ఇటీవల లాస్‌ ఏంజిల్స్‌కు వెళ్లాడు ప్రభాస్. అక్కడి ఎయిర్‌పోర్టులో ప్రభాస్ వెళుతుండగా.. అటుగా వస్తోన్న ఓ యువతి అతడితో ఫొటో తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ప్రభాస్ కూడా ఆమెతో ఫొటోకు ఫోజ్ ఇవ్వడంతో పక్కనున్న వారు క్లిక్ మనిపించారు. అయితే వెంటనే ఉత్సాహం తట్టుకోలేకపోయిన ఆ యువతి ప్రభాస్ బుగ్గను తడిమి గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ప్రభాస్ కూడా చిన్న నవ్వును నవ్వాడు. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సాహోను ఆగష్టు 15న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.