#Covid Tests కేసీఆర్ కోరిక తీర్చిన మోదీ… సీసీఎంబీలో ఇక పరీక్షలు

| Edited By: Pardhasaradhi Peri

Mar 30, 2020 | 6:10 PM

హైదరాబాద్ నగరంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీలో ఇక కరోనా టెస్టింగ్ జరగనున్నది. ఇందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లాక్ డౌన్ ప్రకటనకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో...

#Covid Tests కేసీఆర్ కోరిక తీర్చిన మోదీ... సీసీఎంబీలో ఇక పరీక్షలు
Follow us on

Central government allowed corona tests in Hyderabad CCMB: హైదరాబాద్ నగరంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీలో ఇక కరోనా టెస్టింగ్ జరగనున్నది. ఇందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లాక్ డౌన్ ప్రకటనకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోజే సీసీఎంబీని కరోనా పరీక్షలకు, పరిశోధనలకు వినియోగించుకోవాలని సూచించారు. కేసీఆర్ అభ్యర్థన, సూచనకు ఆరోజునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. అయితే.. వివిధ టెక్నికల్ అంశాల కారణంగా నిర్ణయం తీసుకోవడంలో నాలుగు రోజులు జాప్యం జరిగింది. తాజాగా.. సీసీఎంబీలో పరిశీధనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ లభించడంతో మంగళవారం నుంచే ఆ సంస్థలో కరోనీ పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

కేంద్ర మెడికల్ రీసెర్చ్ నుంచి సోమవారం సీసీఎంబీకి ఆదేశాలు జారీ అయ్యాయి. మంగళవారం నుంచి కరోనా టెస్టులు చేయడానికి సిద్ధమవుతోంది సీసీఎంబీ. గాంధీ ఆసుపత్రి నుంచి సీసీఎంబీకి శాంపిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రతి రోజూ 800 నుంచి 1000 కరోనా టెస్టులు నిర్వహించే సామర్థ్యంతో సీసీఎంబీ సిద్ధమైందని తెలుస్తోంది. దేశంలోనే అత్యంత సాఫిస్టికేటెడ్ పరిశోధనా సంస్థలో కరోనా పరీక్షలు జరిపితే.. తాత్కాలిక ఉపయోగంతోపాటు పరిశోధనల దిశగా దీర్ఘకాలికంగా ఎంతో ఉపయుక్తంగా వుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నుంచి చెబుతున్నారు. ఇదే అంశాన్ని ఆయన ప్రధాన మంత్రికి వివరించడంతో.. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర మెడికల్ రీసెర్చ్ సంస్థ సీసీఎంబీలో పరీక్షలకు, పరిశోధనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.