బ్రేకింగ్.. బాంద్రా ఘటనపై అమిత్ షా ఆగ్రహం..

లాక్ డౌన్ అమల్లో ఉండగా దాన్ని పట్టించుకోకుండా ముంబైలోని బాంద్రాలో పెద్ద సంఖ్యలో కార్మికులు, శ్రామికులు గుమికూడి స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన ఘటనపై హోమ్ మంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రేకింగ్.. బాంద్రా ఘటనపై అమిత్ షా ఆగ్రహం..

Edited By:

Updated on: Apr 14, 2020 | 8:20 PM

లాక్ డౌన్ అమల్లో ఉండగా దాన్ని పట్టించుకోకుండా ముంబైలోని బాంద్రాలో పెద్ద సంఖ్యలో కార్మికులు, శ్రామికులు గుమికూడి స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన ఘటనపై హోమ్ మంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంటే ఈ విధమైన ఘటనలు లక్ష్యాన్ని దెబ్బ తీస్తాయన్నారు. మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే కి ఫోన్ చేసిన ఆయన.. పరిస్థితిని అదుపులోకి తెచ్చెందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ప్రభుత్వానికి మా మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు. బాంద్రా స్టేషన్ వద్ద గుమికూడినవారిలో సమీపంలోని మురికివాడ వాసులు కూడా ఉన్నారని, ఆహారం కోసం వారు అక్కడికి చేరి ఉండవచ్చ్చునని భావిస్తున్నారు. పోలీసులతో అనేకమంది వాదులాటకు దిగడమే కాక.. తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించాలంటూ వారిపైనే దాడికి దిగేందుకు యత్నించడంతో ఖాకీలు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us