Aishwarya Rajesh Viral Video: విజయ్ దేవరకొండ హీరోయిన్ రోడ్డు పక్కన దోశలు వేయడం ఏంటని అనుకుంటున్నారా.? అవునండీ అప్పుడప్పుడు ఇలాంటి చిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో సువర్ణ పాత్రలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తమిళ బ్యూటీ ఐశ్వర్య రాజేష్.. ప్రస్తుతం కబాలి ఫేమ్ పా రంజిత్ నిర్మిస్తున్న మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాకు సతీష్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ విరామ సమయంలో ఐశ్వర్య రోడ్డు పక్కనే దోశలు వేస్తున్న ఒక మహిళ నుంచి పెనం తీసుకుని కాసేపు ఎగ్ దోశలు వేస్తూ సందడి చేసింది. ఈ దోశ ఎవరికి కావాలంటూ అడుగుతూ సరదాగా నవ్వేసింది. ఇక దీనిని ఆమె తన ఇన్‌స్టా అకౌంట్‌లో అప్‌లోడ్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, తెలుగులో నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న టక్ జగదీష్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
For More News:
బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..
‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…
ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…
మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్లపై నిషేధం…
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల
బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్
తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?
హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?
సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!