పాల్గర్ దారుణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఇటీవల ఇద్దరు సాధువులను, వారి కారు డ్రైవర్ ను స్థానికులు కర్రలు, రాడ్లతో కొట్టి చంపిన ఘటనపై సీబీఐ లేదా సిట్ బృందం చేత దర్యాప్తు జరిపించేలా చూడాలంటూ ఒక లాయర్ వేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు అనుమతించింది. బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని కూడా పిటిషనర్ కోరారు. దీనిపై కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ వీటికి రెండు వారాల్లోగా సమాధానాలివ్వాలని ఆదేశించింది. అలోక్ శ్రీవాత్సవ అనే […]

పాల్గర్ దారుణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 30, 2020 | 8:47 PM

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఇటీవల ఇద్దరు సాధువులను, వారి కారు డ్రైవర్ ను స్థానికులు కర్రలు, రాడ్లతో కొట్టి చంపిన ఘటనపై సీబీఐ లేదా సిట్ బృందం చేత దర్యాప్తు జరిపించేలా చూడాలంటూ ఒక లాయర్ వేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు అనుమతించింది. బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని కూడా పిటిషనర్ కోరారు. దీనిపై కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ వీటికి రెండు వారాల్లోగా సమాధానాలివ్వాలని ఆదేశించింది. అలోక్ శ్రీవాత్సవ అనే లాయర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 16 న ఈ జిల్లాలో ఇద్దరు సాధువులు తమ కారులో గుజరాత్ వెళ్తుండగా సుమారు 200 మందితో కూడిన గుంపు వారిపై దాడి చేసి వారిని హతమార్చిన విషయం విదితమే.. ఇద్దరు సాధువుల్లో 70 ఏళ్ళ బాబా కూడా ఉన్నాడు. స్థానికులు అక్కడే ఉన్న ఓ పోలీసు వాహనం పైనా రాళ్లు విసిరి దాన్నిధ్వంసం చేశారు.