ఆస్ట్రేలియా.. ఆ ఒక్కడు 10 వేల మందికి కరోనా అంటించాడా ?

నల్లజాతీయులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' సంస్థ గత ఆదివారం మెల్బోర్న్ లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి 10 వేల మందికి పైగా..

ఆస్ట్రేలియా.. ఆ ఒక్కడు 10 వేల మందికి కరోనా అంటించాడా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 11, 2020 | 7:45 PM

నల్లజాతీయులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ‘బ్లాక్ లివ్స్ మ్యాటర్’ సంస్థ గత ఆదివారం మెల్బోర్న్ లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి 10 వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ ప్రదర్శనలో కరోనా పాజిటివ్ సోకిన ఓ వ్యక్తి కూడా పాల్గొన్నాడట.. ఇతని వైనం ఎలా తెలిసిందో కానీ అధికారులకు తెలిసింది. దీంతో ఆ వ్యక్తికి కాంటాక్ట్ లో ఉన్నవారికి కూడా ఈ వైరస్ సోకి ఉండవచ్చునని భయపడుతున్నారు. ఇది మాస్ ఔట్ బ్రేక్ కి, సెకండ్ వేవ్ కోవిడ్-19 కి దారి తీస్తుందేమోనని ప్రభుత్వవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ ని ఇప్పుడు పాటిస్తున్నందున.. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మరొకరితో జస్ట్.. 15 నిముషాలసేపు ఫేస్ టు ఫేస్ వచ్చినా.. వారిని క్వారంటైన్ కి వెళ్లవలసిందిగా కోరుతున్నారు.

Video Courtesy : Daily Mail