బీజేపీ ‘ ఆకర్ష ‘..టీడీపీ దడదడ !

తెలంగాణాలో ఎటూ టీడీపీ డీలా పడి ‘ కమలం పార్టీ ‘ కాస్తా పుంజుకుంది. ఇక ఏపీపై దృష్టి సారించింది బీజేపీ. ‘ ఆకర్ష,,ఆకర్ష ‘ అంటూ ఆ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతలపై కన్నేసింది. ఏపీలోనూ పాగా వేయాలంటే ఏదో ఒక చిట్కా పాటించక తప్పదు. మొదట టీడీపీ నేతలను వైసీపీలోకి తీసుకోవద్దని ఆ పార్టీకి హితవు చెప్పిందని, ఇందుకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత కూడా అయిన జగన్ ఓకె చెప్పారని తెలిసింది. బీసీ, […]

బీజేపీ ' ఆకర్ష '..టీడీపీ దడదడ !
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 21, 2019 | 7:43 PM

తెలంగాణాలో ఎటూ టీడీపీ డీలా పడి ‘ కమలం పార్టీ ‘ కాస్తా పుంజుకుంది. ఇక ఏపీపై దృష్టి సారించింది బీజేపీ. ‘ ఆకర్ష,,ఆకర్ష ‘ అంటూ ఆ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతలపై కన్నేసింది. ఏపీలోనూ పాగా వేయాలంటే ఏదో ఒక చిట్కా పాటించక తప్పదు. మొదట టీడీపీ నేతలను వైసీపీలోకి తీసుకోవద్దని ఆ పార్టీకి హితవు చెప్పిందని, ఇందుకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత కూడా అయిన జగన్ ఓకె చెప్పారని తెలిసింది. బీసీ, కమ్మ నాయకత్వాలతో పార్టీని పటిష్టం చేయాలనే యోచనలో కమలం పార్టీ ఉందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న నలుగురు టీడీపీ ఎంపీల్లో తెలంగాణకు చెందిన ఒక్క గరికపాటి తప్ప.. మిగతా ముగ్గురూ ఏపీకి చెందినవారే. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన మొత్తం ఆరుగురు ఎంపీలకు వల వేయాలని బీజేపీ భావించినా.. కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి మాత్రం ఆ పార్టీలో చేరడానికి నిరాకరించారు. లోక్ సభలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలను చేర్చుకోవాలని ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదని సమాచారం.

తాజాగా కాషాయ కండువా కప్పుకున్న నలుగురిలో ఒకరైన టీజీ.వెంకటేష్ మొదట వైసీపీలో చేరాలనుకున్నారని, అందుకే కమలనాథుల ఆహ్వానానికి అంతగా స్పందించలేదని… కానీ తెలుగుదేశం పార్టీవారిని చేర్చుకోరాదని వైసీపీకి బీజేపీ పెట్టిన షరతుతో ఆయన మిగతా ముగ్గురితో కలిసి బీజేపీ గడప తొక్కారని తెలుస్తోంది. వ్యాపారాల్లో ఉన్న సుజనాచౌదరి వంటి వారిపై ప్రభుత్వ పరంగా ఒత్తిడి తెఛ్చి వారిని ఆకర్షించాలన్నది ఈ పార్టీ ఎత్తుగడగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇలా ఉండగా.. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఈదర హరిబాబు, బాపట్ల మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిలతో సుజనా ‘ టచ్ ‘ లో ఉన్నట్టు తెలుస్తోంది. రేపోమాపో వీరు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. అటు- రాజ్యసభ వెబ్ సైట్ లో తాజాగా కమలం పార్టీలో చేరిన నలుగురి పేర్లు చేర్చడంతో ఇక వీరిని బీజేపీయులుగా పరిగణించవచ్ఛు.