‘బికినీ’ ఎయిర్‌లైన్స్ బ్యూటిఫుల్ ఆఫర్.. జర దేఖో గురూ!

Bikini Airlines Services From India, ‘బికినీ’ ఎయిర్‌లైన్స్ బ్యూటిఫుల్ ఆఫర్.. జర దేఖో గురూ!

కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు అయిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలోకి రంగం ప్రవేశం చేయనుంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ ‘బికినీ ఎయిర్‌లైన్స్’గా పేరుగాంచింది. ఈ ఎయిర్‌లైన్స్ డిసెంబర్ నుంచి ఇండియా- వియత్నాం మధ్య  ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభించనుంది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని ఆ సంస్థ పేర్కొంది.  హనోయి-ఢిల్లీ మార్గం మధ్య డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని వెల్లడించింది.

ఇది ఇలా ఉంటే ఓ బంపర్ ఆఫర్‌ను కూడా ఈ సంస్థ ప్రకటించింది. త్రి గోల్డెన్‌ డేస్‌ పేరుతో స్పెషల్‌ ప్రమోషన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు కేవలం 9 రూపాయలకే టిక్కెట్లను విక్రయించనుంది. వ్యాపారాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో భారతదేశం తమకు మొదటి ప్రాధాన్యమని వియత్‌జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్‌ తన్ సన్  తెలిపారు.

ఇకపోతే 2011 డిసెంబర్‌లో మొదలైన ఈ వియత్ జెట్ సంస్థ ‘బికినీ ఎయిర్‌లైన్స్’గా పేరుగాంచడం వెనుక ఓ స్టోరీ ఉంది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాల్లో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు. అంతేకాకుండా ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్‌లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి. వియత్నాం ప్రయాణికులు కూడా ఎక్కువగా ఈ ఎయిర్‌లైన్స్‌నే ఎక్కుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *