ఎన్డీయే వెంటే బీహార్ ప్రజలుః ప్రధాని మోదీ

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజా సంక్షేమం మరిచి అవినీతి రాజ్యమేలిందన్నారు.

ఎన్డీయే వెంటే బీహార్ ప్రజలుః ప్రధాని మోదీ
Follow us

|

Updated on: Oct 28, 2020 | 2:56 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజా సంక్షేమం మరిచి అవినీతి రాజ్యమేలిందన్నారు. ప్రజల అవసరాలను విస్మరించిన నేతలు కమీషన్ల కోసమే పని చేశారని విమర్శించారు. బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బిహార్‌ను ఎన్డీయే మాత్రమే కాపాడగలుగుతుందని, అందుకే ప్రజలందరూ ఎన్డీయే కూటమిని ఆదరించాలని పిలుపునిచ్చారు.

కేంద్రం ఇటీవల మహాసేతును ఆవిష్కరించిందన్న ప్రధాని.. దీని ద్వారా రైతులు, వ్యాపారులతో పాటు విద్యార్థుల ప్రయాణాల సమయం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఉపాధి దొరకడానికి కూడా అవకాశం ఉందన్నారు. ఓటు వేసే సందర్భంగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చడమే మా లక్ష్యమన్నారు మోదీ. తమ దృష్టి అంతా ‘ఆత్మనిర్భర బిహార్’ వైపే కేంద్రీకృతమైందని, ప్రతిపక్షాల కళ్లు మాత్రం ప్రాజెక్టులకు చెందిన డబ్బులపైనే ఉన్నాయని విమర్శించారు. బిహార్‌ను ‘జంగల్ రాజ్’ గా మార్చిన వారిని, దోచుకున్న వారికి ఓటు వేయమని నిర్ణయించుకున్నారని మోదీ పేర్కొన్నారు.