‘బిగ్‌బాస్ 3’ సెట్‌లోకి వెళ్లిన తెలంగాణ పోలీసులు

Vanitha Vijaykumar, ‘బిగ్‌బాస్ 3’ సెట్‌లోకి వెళ్లిన తెలంగాణ పోలీసులు

కమల్ హాసన్ వ్యాఖ్యాతగా తమిళనాట బిగ్‌బాస్ 3 ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ఒక కంటెస్టెంట్‌గా సీనియర్ నటుడు విజయ్ కుమార్, మంజులల పెద్ద కుమార్తె, నటి వనితా విజయ్ కుమార్ ఉన్నారు. అయితే ఆమెను అరెస్ట్ చేసేందుకు తెలంగాణకు చెందిన పోలీసులు తాజాగా బిగ్‌బాస్ సెట్‌లోకి వెళ్లారు. ఏ క్షణమైనా వారు ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Vanitha Vijaykumar, ‘బిగ్‌బాస్ 3’ సెట్‌లోకి వెళ్లిన తెలంగాణ పోలీసులు

వివరాల్లోకి వెళ్తే.. 2007కు హైదరాబాద్‌కు చెందిన ఆనంద్‌రాజ్‌ను వివాహం చేసుకున్న వనిత, 2012లో అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీరి కుమార్తె సంరక్షణ బాధ్యతల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం జరుగుతోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తన కుమార్తెను చెన్నై తీసుకెళ్లిన వనిత.. ఆమెను తనకు అప్పగించకుండా దాచిపెట్టినట్లు ఆనంద్ రాజ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ ఉన్న ఈవీపీ ఫిలిం సిటీ ప్రాంతానికి చెందిన నజ్రత్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించిన తెలంగాణ పోలీసులు వనిత అరెస్ట్‌కు సహకరించవలసిందిగా కోరారట. ఈ నేపథ్యంలో వనితను వారు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *