Bigg Boss 4: రెమ్యునరేషన్‌పై సూర్య కిరణ్ షాకింగ్ కామెంట్లు

ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొన్న దర్శకుడు సూర్య కిరణ్ మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు

Bigg Boss 4:  రెమ్యునరేషన్‌పై సూర్య కిరణ్ షాకింగ్ కామెంట్లు

Updated on: Sep 19, 2020 | 5:38 PM

Surya Kiran Remuneration: ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొన్న దర్శకుడు సూర్య కిరణ్ మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. హౌజ్‌లో అందరిపై ఆధిపత్యం చూపిస్తోన్న క్రమంలో‌ అతడిని తొలి వారమే ఇంటికి సాగనంపారు నాగార్జున. ఇక బయటకు వచ్చిన తరువాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సూర్య కిరణ్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చినందుకు ఎంత మాత్రం బాధపడలేదని, నిజానికి చెప్పాలంటే బిగ్‌బాస్ హౌజ్ తనకు నచ్చలేదని సూర్య కిరణ్ అన్నారు. ఇక రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. తను ఊహించిన దానికంటే ఎక్కువనే ఇచ్చారని చెప్పుకొచ్చారు. అంత ఇస్తారని తాను అసలు అనుకోలేదని తెలిపారు. ఎంత ఇచ్చారన్న నంబర్‌ని బయటకు చెప్పకపోయినా.. తాను అడిగిన దానికంటే పది  రెట్లు ఎక్కువగా తనకు వచ్చిందని పేర్కొన్నారు.

లక్షల్లో తనకు రెమ్యునరేషన్ వచ్చిందని, ఆ డబ్బుతో 5 నుంచి 6 నెలలు పాటు ఇంట్లో కూర్చొని తినొచ్చని అన్నారు. ఈ లెక్కన చూస్తుంటే సూర్య కిరణ్‌కి మంచి డబ్బే ముట్టినట్లు ఉంది. కాగా ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరికి భారీగానే ముట్టనుందని, అందరి కంటే లాస్యకు ఎక్కువగా ఇచ్చినట్లు ఇంతవరకు వార్తలు వినిపించాయి. అయితే గురువారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌కి లాస్య కంటే రెట్టింపు పారితోషికాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read More:

అప్పుడు తప్ప ఎప్పుడూ స్మోక్ చేయను: రకుల్

నితిన్ ‘అంధాధూన్’ రీమేక్‌.. హీరోయిన్లు ఫిక్స్‌

Loading...
Unable to load recommendations.
Follow Us