చాలా తెలివిగా ఆడుతోంది.. గంగవ్వపై కళ్యాణి సంచలన కామెంట్లు

బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటికి వస్తోన్న కంటెస్టెంట్‌లను బిగ్‌బాస్ బజ్ పేరిట మూడో సీజన్ విన్నర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఇంటర్వ్యూ చేస్తోన్న విషయం తెలిసిందే

చాలా తెలివిగా ఆడుతోంది.. గంగవ్వపై కళ్యాణి సంచలన కామెంట్లు

Updated on: Sep 22, 2020 | 8:40 AM

Karate Kalyani Bigg Boss: బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటికి వస్తోన్న కంటెస్టెంట్‌లను బిగ్‌బాస్ బజ్ పేరిట మూడో సీజన్ విన్నర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఇంటర్వ్యూ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోవారం హౌజ్ నుంచి బయటికి వచ్చిన కరాటే కళ్యాణిని రాహుల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోలో హౌజ్‌లోని అందరూ మంచోళ్లే అంటూ ప్రారంభించిన కళ్యాణి.. ఒక్కొక్కరి గుట్టును బయటకు లాగారు.

బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్తూనే ప్రతి ఒక్కరికి మాస్క్‌ వస్తుందని, గంగవ్వ కూడా మాస్క్ ధరించే గేమ్‌ ఆడుతుందని ఆమె అన్నారు. చాలా తెలివిగా గంగవ్వ ఆడుతుందంటూ కళ్యాణి చెప్పుకొచ్చారు. ఆరోగ్యం బాలేక గంగవ్వ బయటకు రావొచ్చేమో గానీ హౌజ్‌లో గంగవ్వ కొనసాగడం గ్యారెంటీ ని ఆమె తెలిపారు. జనాలందరికీ గంగవ్వ బాగా నచ్చిందని పేర్కొన్నారు. ఇక రాజశేఖర్ మాస్టర్ గ్యాంగ్‌ లీడర్ అని, దేవి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదని, కొంతమంది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఆటలాడుతున్నారని, మనకు పైకి కనిపించే నోయల్ నిజం కాదని, మరో నోయల్ ఉన్నాడని కళ్యాణి చెబుతున్నారు.

Read More:

ఇవాళ ఢిల్లీ సీఎం వైఎస్ జగన్

Bigg Boss 4: ఈ సారి ఎలిమినేషన్‌లో ఏడుగురు.. లిస్ట్‌ ఇదే

Loading...
Unable to load recommendations.
Follow Us