Bigg Boss 4: గంగవ్వ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

| Edited By:

Sep 20, 2020 | 7:40 AM

బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్‌లలో గంగవ్వ ఒకరు. మోస్ట్‌ పవర్‌ఫుల్‌‌ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు గంగవ్వ

Bigg Boss 4: గంగవ్వ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌
Follow us on

Bigg Boss 4 Gangavva: బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్‌లలో గంగవ్వ ఒకరు. మోస్ట్‌ పవర్‌ఫుల్‌‌ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు గంగవ్వ. అంతేకాదు కంటెస్టెంట్‌ల ఎంట్రీ తరువాత బిగ్‌బాస్‌ నిర్వహించిన పోల్‌లో గంగవ్వ టాప్‌గా నిలిచారు. అంతేకాదు ఆమె పేరు మీద బయట ఆర్మీ కూడా ఏర్పడింది. ఇక లోపలికి వెళ్లిన తరువాత మొదటి వారం బాగా స్ట్రాంగ్‌గా ఉన్న గంగవ్వ.. రెండో వారం మాత్రం డీలా పడ్డారు.

కాస్త అనారోగ్యంతో కనిపించారు. అంతేకాదు కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లి.. మట్టి మనిషిని ఇక్కడ ఉండలేకపోతున్నా.. నేను వెళ్లిపోతాను.. పంపేయండి అంటూ ఏడ్చేశారు. ఆ ఎపిసోడ్‌ చూసిన ఆమె అభిమానులు బాధపడగా.. ఈ వయసులో హౌజ్‌లో పెట్టి గంగవ్వను ఇబ్బందికి గురి చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. ఇక ఆమెను బయటకు తీసుకురావాలన్న ఆలోచనలో అభిమానులు ఉన్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే వీకెండ్‌ ఎపిసోడ్‌లో గంగవ్వ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. బర్రె ముక్కు పెట్టుకొని వచ్చావు అంటూ అవినాష్‌ని ఇమిటేట్ చేసింది. ఆ తరువాత గంగవ్వను కన్ఫెన్షన్‌ రూమ్‌లోకి పిలిచిన నాగార్జున..  ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. అందుకు గంగవ్వ.. ఇప్పుడు బావుంది. సూది మందు వేశారు. అందరూ బాగా చూసుకుంటున్నారు. ఎంజాయ్‌గా ఉందని చెప్పుకొచ్చింది. ఆ తరువాత నాగార్జున.. గంగవ్వా నువ్వు నన్ను అన్నా అన్నావు. చెల్లెల్ని బాగా చూసుకునే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. దీంతో గంగవ్వ బిగ్‌బాస్‌ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందన్న రూమర్లకు నాగార్జున చెక్ పెట్టారు.

Read More:

Bigg Boss 4: కరాటే కళ్యాణి ఔట్.. నెక్ట్స్‌ అతడే..!

రాయుడు విజృంభణ,‌ చెన్నై బోణీ