Bigg Boss 4: ఆ కంటెస్టెంట్‏ గురించి క్లారిటీ ఇచ్చిన మోనాల్.. తనకే నా సపోర్ట్ అంటూ..

|

Dec 14, 2020 | 8:30 PM

బిగ్‏బాస్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్‏లో ఐదుగురు సభ్యుల కోసం సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

Bigg Boss 4: ఆ కంటెస్టెంట్‏ గురించి క్లారిటీ ఇచ్చిన మోనాల్.. తనకే నా సపోర్ట్ అంటూ..
Follow us on

బిగ్‏బాస్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్‏లో ఐదుగురు సభ్యుల కోసం సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించేందుకు రెడి అయ్యారు. బిగ్‏బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా తమ తమ ఫెవరేట్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో ప్రేక్షకులను కోరుతున్నారు. అయితే బిగ్‏బాస్ 14వ వారంలో ఎలిమినేట్ అయినా మోనాల్ కూడా ఆ కోవలోకి వచ్చి చేరింది.

పద్నాలుగు వారాలు హౌస్‏లో కొన్ని రోజులు అటు అభిజిత్, ఇటు అఖిల్‏తో క్లోజ్‍గా ఉండడంతో ఇంట్లో ట్రయంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని సోషల్ మీడియాలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అభితో మనస్పర్ధలు రావడంతో ఈ బ్యుటీ అఖిల్‏లో ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఆదివారం ఎలిమినేషన్ అనంతరం ఆమె సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‏తో ముచ్చటించింది. ఈ క్రమంలోనే అఖిల్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చేసింది. గేమ్ మొదటి రోజు నుంచి అఖిల్ తనకు చాలా సపోర్ట్‏గా ఉన్నాడని.. ఇప్పుడు తన కోసం మనం నిలబడాల్సిన సమయం వచ్చిందని తెలిపింది. బిగ్‏బాస్ విజేతగా అఖిల్‏ను గెలిపించడం కోసం అందరు ఓట్లు వేయాలని తన అభిమానులను కోరింది. అతనితోపాటు సోహైల్, హారికకు కూడా సపోర్ట్ చేయాలని తన ఫ్యాన్స్‏ను రిక్వెస్ట్ చేసింది.