ప్రస్తుతం మార్కెట్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో పెద్దపెద్ద కంపెనీలన్నీ వినియోగదారులని ఆకట్టుకునేందకు ప్రత్యక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టాటా మోటర్స్ కూడా ఎలక్ట్రిక్ వర్షన్‌లో అద్బుతమైన కారును మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. టాటా మోటర్స్‌లోని పాపులర్ మోడల్ అయిన నెక్సాన్‌లో.. ఎలక్ట్రిక్ వెర్షన్ (ఈవీ)ను విడుదలచేసింది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. దీనిని ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే.. దాదాపు 300 కిలో మీటర్లకు పైగా ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. అంతేకాదు.. బ్యాటరీపై అనుమానాలు లేకుండా.. ఏకంగా ఎనిమిదేళ్ల పాటు గ్యారెంటీని ఇస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ నెక్సాన్ ఈవీని.. వాణిజ్యపరంగా విడుదల చేస్తామని సంస్థ తెలిపింది. ఇక దీని ధర.. రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంటుందని పేర్కొంది. జిప్‌ట్రాన్ టెక్నాలజీతో నడిచే ఈ కారు.. కేవలం 9.9 సెకన్ల వ్యవధిలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు.. ఇందులో 35 కనెక్టెడ్ ఫీచర్లున్నాయి.
కాగా, ఇప్పటికే టాటా మోటర్స్.. టిగోర్ ఎలక్ట్రిక్ వర్షన్స్‌ను పరిచయం చేసింది. ఈ మోడల్‌పై కస్టమర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ బాగుందని.. కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. కాగా.. ప్రస్తుతం..ఈ నెక్సాన్ ఈవీ ద్వారా.. ఇండివిడ్యువల్ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ తెలిపింది. తొలుత ఈ కారును 22 నగరాల్లో విడుదల చేయనున్నారు. శుక్రవారం నుంచే దీని బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. ఆన్‌లైన్ లేదా సెలక్టెడ్ క్రోమా స్టోర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. గరిష్టంగా ఈ కారు ధర రూ.17 లక్షలుగా ఉంది. కిలో మీటరుకు కేవలం రూ.1 ఖర్చుతో ఈ కారులో ప్రయాణం చేయవచ్చని.. సంస్థ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర వెల్లడించారు.