Big News Big Debate: బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య నువ్వా- నేనా అన్నట్టుగా ఆపరేషన్‌ ఆకర్ష్‌

Updated on: Oct 21, 2022 | 7:14 PM

బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ఆపరేషన్‌ ఆకర్ష్‌ నువ్వా- నేనా అన్నట్టుగా సాగుతోంది. నిన్నమొన్నటి దాకా మండల, గ్రామస్థాయి నాయకులతో వలసలతో నియోజకవర్గానికి పరిమితం అయింది. కానీ ఇది స్టేట్‌ పాలిటిక్స్‌కు కూడా పాకింది.

మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో బైపోల్‌ హీట్‌ మరింత పెరిగింది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మునుగోడు పరిధిలో చోటా మోటా నేతలు కండువాలు మార్చేస్తుంటే రాష్ట్ర స్థాయిలోనూ కీలక నేతలు రాత్రికి రాత్రే జెండాలు మారుస్తున్నారు. ముందురోజు నామినేషన్‌లో పాల్గొన్న బూర నర్సయ్యగౌడ్‌ తెల్లారేసరికి బీజేపీకి దగ్గరయ్యారు… ఇక బీజేపీలో ఉన్న స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌లు అనూహ్యంగా టీఆర్ఎస్‌ గూటికి చేరారు. ఇంకా మరికొన్ని పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఎవరికి వారు బీసీలకు ఆత్మగౌరవం లేదంటూ పార్టీ వీడటం ఇక్కడ ఆసక్తికరంగా మారింది.

Published on: Oct 21, 2022 07:14 PM