Big News Big Debate: గుంటూరు జిన్నా టవర్‌ పే రచ్చ.. కాషాయం లేటెస్ట్‌ ఈక్వేషన్‌.. ముస్లిం లీగ్‌ నుంచి రియాక్షన్‌..

|

Dec 30, 2021 | 10:01 PM

Big News Big Debate: గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చండి లేదంటే కూల్చేస్తామంటోంది బీజేపీ. 75ఏళ్ల తర్వాత కూడా ఓ దేశద్రోహి పేరుతో సెంటర్‌ ఉండటం..

Big News Big Debate: గుంటూరు జిన్నా టవర్‌ పే రచ్చ.. కాషాయం లేటెస్ట్‌ ఈక్వేషన్‌.. ముస్లిం లీగ్‌ నుంచి రియాక్షన్‌..
Follow us on

Big News Big Debate: గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చండి లేదంటే కూల్చేస్తామంటోంది బీజేపీ. 75ఏళ్ల తర్వాత కూడా ఓ దేశద్రోహి పేరుతో సెంటర్‌ ఉండటం దేశానికే అవమానమంటున్నారు కాషాయ దళాలు. దేశద్రోహం గురించి ద్రోహులే మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తోంది ముస్లిం లీగ్‌ పార్టీ. టవర్‌ జోలికొస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చింది. పేరే సమస్య అయితే ఆగ్రాలో తాజ్‌మహల్‌, హైదరాబాద్‌లో చార్మినార్‌ కూడా కూల్చేస్తారా అంటూ కాంగ్రెస్‌ కొత్త డౌట్‌ వ్యక్తం చేసింది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ చీఫ్‌ వీర్రాజు చేసిన లిక్కర్‌ కామెంట్స్‌‌ రేపిన చిచ్చు నుంచి సబ్జెక్ట్‌ ఇప్పుడు దేశభక్తికి మార్చే ప్రయత్నమా ఇది అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ సభ మహిమో ఏంటో కానీ ఏపీ బీజేపీ ఏం చేసినా సంచలనమే అవుతోంది. ఏం మాట్లాడినా రచ్చ రచ్చ అవుతోంది. చీప్‌ లిక్కర్‌ రేట్లపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై గల్లీ టు ఢిల్లీ చర్చ జరుగుతుండగానే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌.. జిన్నా టవర్‌పై పెట్టిన ట్వీట్‌ ఏకంగా భూకంపమే సృష్టిస్తోంది. దీని ప్రకంపనలు తెలంగాణకూ పాకాయి. గుంటూరులో జిన్నా పేరుతో టవర్‌ ఏంటని దేశద్రోహి పేరు ఉండటం ప్రజలకే అవమానమంటున్నారు బీజేపీ నాయకులు. పేరు మారుస్తారా? కూల్చమంటారా అంటూ అల్టిమేటమిచ్చారు. దేశవిభజనకు, లక్షలమంది ఊచకోతకు కారకుడు అయిన జిన్నా దేశద్రోహి అంటోంది భారతీయ జనతా పార్టీ. టాప్‌ టు బాటమ్‌ బీజేపీ లీడర్స్ అంతా దీనిపైనే ఫోకస్‌ పెట్టి మరీ దేశభక్తిని రగిలించే ప్రయత్నంలో ఉన్నారు.

అసలైన దేశభక్తుడు జిన్నా అయితే దేశద్రోహులు ఆర్ఎస్ఎస్ అంటూ అగ్గికి ఆజ్యం పోసింది ముస్లింలీగ్‌ పార్టీ. బీజేపీ సిద్దాంతకర్తలుగా చెప్పుకునే పెద్దలకే న్యాయసేవలు అందించిన గొప్ప దేశభక్తుడు తమ జిన్నా అంటోంది ముస్లింలీగ్‌. గుంటూరు నడిబోడ్డున ఉన్న జిన్నా టవర్‌ టచ్‌ చేసి చూడండి అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ దాకా ముస్లిం పూర్వికులు కట్టిన భవనాలే ఘనతగా చాటుకుంటూ ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఏంటని ప్రశ్నిస్తోంది ఎంఐఎం.

తాజ్‌మహల్‌, చార్మినార్‌ కూడా కూల్చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఏడేళ్లుగా చేసింది ఏమీ లేని బీజేపీ నాయకులు విద్వేష రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గోల్కొండ, చార్మినార్‌ పేర్లు కూడా మారుస్తారా అంటున్నారు వీహెచ్‌.

గతంలో ప్రొద్దుటూరులోనూ టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు వివాదం రాజకీయంగా రణరంగంగా మార్చింది. ఇప్పుడు గుంటూరు నడిబోడ్డున ఉన్న జిన్నా సెంటర్‌పైనే రచ్చ మొదలైంది. ఎక్కడిదాకా పోతుందో చూడాలి.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.

Also read:

Uttarakhand Assembly Election 2022: ఆ చేతులే రాష్ట్రాన్ని లూటీ చేశాయి.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా ప్రధాని మోడీ విమర్శలు..

Diabetes Care: చలికాలంలో షుగర్ అదుపులో ఉండాలంటే.. ఈ పదార్థాలను తీసుకోండి..

Gold Price: వినియోగదారులకు కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాకివ్వనున్నాయా..? కారణం ఏమిటి..?