హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని స్కైబ్లూ హోటల్లోని 3వ అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. మొదట పెంట్ హాస్లో మంటలు చెలరేగాయి. తరువాత హోటల్ అంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంతో ఫర్నీచర్ పూర్తిగా కాలిబూడిదైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గీజర్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో […]

హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2019 | 10:42 AM

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని స్కైబ్లూ హోటల్లోని 3వ అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. మొదట పెంట్ హాస్లో మంటలు చెలరేగాయి. తరువాత హోటల్ అంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంతో ఫర్నీచర్ పూర్తిగా కాలిబూడిదైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గీజర్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.