బెస్ట్ హంటెడ్ టూరిజం స్పాట్.. అదెక్కడో తెలుసా..?

భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దేశవిదేశాల నుంచి ఎంతోమంది భారత్‌‌లోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వస్తుంటారు. ఇక్కడ ఎన్నో పురాతనమైన ఆలయాలు, కట్టడాలు, శిల్పాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని కట్టడాలను చూస్తే.. ఆ కాలంలోని రాజుల జీవనవిధానం, వారి కట్టుబాట్లు తెలుస్తాయి. వీటితో పాటు ఫేమస్ అయిన నదులు, జలపాతాలు, అడవులు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం టూరిజం ప్రాంతాలను డెవలప్ చేయడానికి.. ఆ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు అన్నిటికంటే టూరిజం వల్లే […]

బెస్ట్ హంటెడ్ టూరిజం స్పాట్.. అదెక్కడో తెలుసా..?
Follow us

| Edited By: seoteam.veegam

Updated on: Sep 27, 2019 | 3:47 PM

భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దేశవిదేశాల నుంచి ఎంతోమంది భారత్‌‌లోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వస్తుంటారు. ఇక్కడ ఎన్నో పురాతనమైన ఆలయాలు, కట్టడాలు, శిల్పాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని కట్టడాలను చూస్తే.. ఆ కాలంలోని రాజుల జీవనవిధానం, వారి కట్టుబాట్లు తెలుస్తాయి. వీటితో పాటు ఫేమస్ అయిన నదులు, జలపాతాలు, అడవులు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం టూరిజం ప్రాంతాలను డెవలప్ చేయడానికి.. ఆ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు అన్నిటికంటే టూరిజం వల్లే ఎక్కువ ఆదాయం వస్తోంది. అలాగే కొన్ని చూడదగ్గ పర్యటక కట్టడాల్లో దెయ్యాలు కూడా ఉన్నాయని ప్రచారం ఉంది. అయినప్పటికీ వాటిని చూసేందుకు, వాటి గురించి తెలుసుకునేందుకు పర్యాటకులు వస్తుంటారు.

భారత దేశంలో అత్యంత భయంకరమైన వాటిలో కుల్దారా ప్రాంతం ఒకటి. హెంటెడ్ టూరిజానికి ఈ ప్రాంతం పేరు గాంచింది. చాలా కాలం క్రితం సుసంపన్నమైన ఈ గ్రామం ఓ మాంత్రికుడి శాపం వల్ల దెయ్యాల దిబ్బగా మారిందని చెబుతారు. రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జై సల్మీర్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది. పగటి సమయంలో వందల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి చూడటానికి సాహసించరు.

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బాంగ్రా కోట. ఇది కూడా రాజస్థాన్‌లోనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రాంతంగా ఈ కోటకు పేరుంది. పగటి సమయంలో మాత్రమే దీనిని చూడటానికి పర్యాటకులకు అనుమతి ఇస్తారు. రాత్రి సమయంలో ఈ కోటలో ఒక్కరిని కూడా ఉండనివ్వరు. దీని గురించి గతంలో కథలు కథలుగా చెప్పుకునే వారు. ఈ కోట గురించి సినిమాల్లో కూడా చూపించారు. దీని గురించి తెలియక.. చాలా మంది చూసేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఈ కోటను కచ్వాహా పాలకుడు రాజా భగవత్ సింగ్ నిర్మించారు. తన చిన్నకుమారుడు మాధో సింగ్ కోసం క్రీస్తుశకం 1573లో బాంగ్రా కోటను నిర్శించారు.

బాంగ్రా కోటకు సమీపంలో శనివార్ వాడ అనే మరో కోట ఉంది. దీనిని పేష్వా బాజీరావ్ గౌరవార్థం క్రీస్తుశకం 1732లో నిర్మించారు. ఈ కోటను చూడటానికి కూడా కేవలం ఉదయం పూట మాత్రమే అనుమతి ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ నన్ను కాపాడు.. నన్ను కాపాడు అనే కేకలు వినిపిస్తూనే ఉంటాయని కొందరు చెబుతుంటారు. అవి నారాయణ రావు అనే వ్యక్తి కేకలు అని అంటుంటారు. రాజకీయ కారణాలతో అతను హత్య చేయించబడ్డాడు. అయితే ఈ కోటపై ఉన్న మమకారంతో అతని ఆత్మ ఇప్పటికే అక్కడే తిరుగుతూ ఉందని చెబుతారు.