Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 71 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1991 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ మృతులు 1. మొత్తం ఇప్పటివరకు 57 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 650 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

Facebook Live-Streaming : సరదా తీసిన ప్రాణం..

Bengal Man Falls Off Motorcycle While Live-Streaming On Faceboo.. Dies: Report, Facebook Live-Streaming : సరదా తీసిన ప్రాణం..

ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాకు బానిసలైపోయారు. ముఖ్యంగా ఫేస్‌బుక్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియాలకు ఎంత అడిక్ట్ అయ్యారో చెప్పక్కర్లేదు. ఇందులో టిక్ టాక్ వీడియోస్ చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తే.. ఇక ఫేస్ బుక్‌ని మాత్రం నిద్ర లేచినప్పటి నుంచి పోస్టింగ్స్ పెడుతూ.. ఎక్కడికి వెళ్తున్నారన్నది కూడా లైవ్ పెడతారు కొందరు. అయితే ఇది నార్మల్‌గా పెడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ.. రన్నింగ్‌లో పెడితే మాత్రం ప్రమాదాలు కొనితెచ్చకున్నట్లు అవుతుంది.

తాజాగా వెస్ట్ బెంగాల్‌లో జరిగిన సంఘటన చూస్తే నిజమనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని అందాల్ పట్టణానికి చెందిన చంచల్ ధిబోర్ అనే 24 ఏళ్ల యువకుడు శనివారం సాయంత్రం పట్టణంలోని కాళీ మాత గుడికి బైక్‌పై వెళ్లాడు. అనంతరం గుడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో.. బైక్‌ నడుపుతూనే ఫోన్ తీసి అందులో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేశాడు. అలా ఎఫ్బీ లైవ్ పెట్టి కాస్త ముందుకు వెళ్లాడో లేదో.. బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో తలకు దెబ్బ తగిలింది. అది గమనించిన స్థానికులు వెంటనే అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు గట్టిగా దెబ్బ తగలడంతో.. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించాడు.

కాగా, మృతుడి స్నేహితులు.. ఎఫ్బీ లైవ్ గురించి స్పందించారు. చంచల్ బండి నడపడం, కింద పడిపోవడం, అది చూసినవారు వచ్చి హెల్ప్ చేయడం అంతా ఫేస్ బుక్ లైవ్ లో కనిపించిందని.. ఇలా బైక్‌ నడుపుతూ లైవ్ పెట్టి.. చనిపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు.

Related Tags