రవిశాస్త్రి ఎఫెక్ట్.. క్రికెటర్లకు బీసీసీఐ వరాల జల్లు!

Team India Players Get Massive Pay Hike Dhoni And Ashwin Miss A Plus Grade, రవిశాస్త్రి ఎఫెక్ట్.. క్రికెటర్లకు బీసీసీఐ వరాల జల్లు!

ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిఒక్కరికీ క్రికెట్ అంటే ప్రాణమని చెప్పవచ్చు. అందుకేనేమో అనేక బ్రాండింగ్ కంపెనీలు.. మ్యాచ్‌ల ప్రసారాల ద్వారా.. స్పాన్సర్‌షిప్స్‌తోనూ కోట్లు గడిస్తుంటాయి. అటు ఐపీఎల్ నుంచి వచ్చే అమౌంట్ గురించి వేరేగా  చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని వైపుల నుంచీ డబ్బులు ఆర్జిస్తూ బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా ఎదిగింది. ఇందువల్లే చాలామంది క్రికెటర్లు జట్టులో స్థానం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక్కసారి ఎంపికైతే చాలు ఇక వారి జీవితం సెటిల్ అయినట్లే. అంత భారీగా సంపాదన ప్లేయర్స్ సొంతమవుతుంది. అయితే బీసీసీఐ మాత్రం ఆటగాళ్లతో సంవత్సరానికి కాంట్రాక్టు కుదుర్చుకుని ఆ మేరకు చెల్లింపులు చేస్తుంటుంది. ఇప్పటికే కోట్లు అందుకుంటున్న ఆటగాళ్లకు బీసీసీఐ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి ఇస్తున్న రోజువారీ భత్యాన్ని రెట్టింపు చేస్తూ బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌(సీఓఎ) నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఆటగాళ్లకు రోజువారీగా ఖర్చుల కింద 125 డాలర్లు ఇస్తుంటే.. దాన్ని 250 డాలర్లకు పెంచుతూ సీఓఎ నిర్ణయం తీసుకుంది. 250 డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాల 17,800 రూపాయలు. ఈ మొత్తాన్ని క్రికెటర్లు తమ వ్యక్తిగత ఖర్చుకు ఉపయోగించుకోవచ్చు. ఇక ఆటగాళ్ల బస.. వగేరా ఖర్చులన్నీ పూర్తిగా బీసీసీఐ భరిస్తుందన్న విషయం తెలిసిందే. రోజుకు 17,800 రూపాయలంటే మాటలు.. చూశారుగా మన ఆటగాళ్ల జాక్‌పాట్ కొట్టినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *