ఇక ‘ఆత్మ నిర్భర్’, వంద మిలిటరీ సాధనాల దిగుమతిపై నిషేధం

ఆత్మ నిర్భర్ (స్వావలంబన) లక్ష్య సాధనలో భాగంగా  101 మిలిటరీ సాధనాల దిగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా ఉత్పత్తి చేయాలన్నదే ధ్యేయమని, అందుకే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఆర్టిలరీ గన్స్, కొంబాట్ హెలికాఫ్టర్లు, అసాల్ట్ రైఫిల్స్, రాడార్, మిలిటరీ శకటాలు తదితరాలను ఇక దేశంలో తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్ఛే ఏడాది డిసెంబరు నాటి నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. […]

ఇక 'ఆత్మ నిర్భర్', వంద మిలిటరీ సాధనాల దిగుమతిపై నిషేధం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 09, 2020 | 4:17 PM

ఆత్మ నిర్భర్ (స్వావలంబన) లక్ష్య సాధనలో భాగంగా  101 మిలిటరీ సాధనాల దిగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా ఉత్పత్తి చేయాలన్నదే ధ్యేయమని, అందుకే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఆర్టిలరీ గన్స్, కొంబాట్ హెలికాఫ్టర్లు, అసాల్ట్ రైఫిల్స్, రాడార్, మిలిటరీ శకటాలు తదితరాలను ఇక దేశంలో తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్ఛే ఏడాది డిసెంబరు నాటి నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ గతంలో నే ఆత్మ నిర్భర్ నినాదాన్ని ప్రస్తావించిన సంగతి విదితమే. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని ప్రకటించిన ఆయన మరోవైపు.. విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని కూడా అంటున్నారు.