‘అయోధ్య ట్రస్టు’ లో వీహెచ్‌పీ ‘రాజ్యం’.. పీఎం మోదీ సహచరులకు ప్రాధాన్యం

అయోడ్జ్యాలో రామ మందిర నిర్మాణ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన రామ్ టెంపుల్ ట్రస్టులో విశ్వహిందూ పరిషద్ కి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఈ సంస్థ చీఫ్ నృత్య గోపాల్ దాస్ ఈ ట్రస్టుకు నేతృత్వం వహించనున్నారు.

'అయోధ్య ట్రస్టు' లో వీహెచ్‌పీ 'రాజ్యం'.. పీఎం మోదీ సహచరులకు ప్రాధాన్యం
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2020 | 9:48 AM

అయోడ్జ్యాలో రామ మందిర నిర్మాణ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన రామ్ టెంపుల్ ట్రస్టులో విశ్వహిందూ పరిషద్‌కి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఈ సంస్థ చీఫ్ నృత్య గోపాల్ దాస్ ఈ ట్రస్టుకు నేతృత్వం వహించనున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితుడైన ఈయన.. ఇక మందిర నిర్మాణానికి అవసరమైన అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈ సంస్థలోని మరో ముఖ్య సభ్యుడు, వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన చంపత్ రాయ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ఆఫీసు బేరర్లను లాంఛనంగా ప్రకటించారు. ప్రధాని మోదీకి మాజీ సహచరుడైన నృపేంద్ర మిశ్రా ఆలయ కమిటీ నిర్మాణ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారని ట్రస్ట్ పేర్కొంది. ఖఛ్చితంగా రామ మందిర నిర్మాణ తేదీని ఈ సంస్థ ఖరారు చేయనుంది. అయితే శ్రీరామనవమి రోజయిన ఏప్రిల్ 2 న మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని బుధవారం వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే.

ఇక రామజన్మ భూమి ట్రస్టు.. ట్రస్టీ అయినా విశ్వ ప్రసన్న తీర్థ స్వామి … ఆలయ నిర్మాణ కమిటీ వచ్ఛే నెల సమావేశమవుతుందని తెలిపారు. అయితే ట్రస్టు ఏర్పాటుపై అప్పుడే ‘స్వాముల్లో’ చీలికలు, భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. హనుమాన్ గర్హికి చెందిన మహంత్ ధర్మదాస్.. ట్రస్టు ఏర్పాటుపై పెదవి విరిచారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తోసిరాజని… సమర్థులైన వారిని కాదని, 80. 90 సంవత్సరాల వృధ్ధులను ఇందులో నియమించారని ఆయన విమర్శించారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో