
మేష రాశి వారికి శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25 న ఏర్పడే యోగం వలన ఆర్థికంగా కలిసివస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోను విజయం వీరి సొంతం అవుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. రియలెటస్టేట్ రంగంలో ఉన్నవారికి, వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం వీరి సొంతం అవుతుంది. ఆకస్మిక ధనల లాభం కలుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి వారు చాలా అదష్ట వంతులు అని చెప్పాలి. కుంభ రాశిలోకి బుధుడి సంచారం వలన అనేక కొత్త అవకాశాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది.

మకర రాశి వారు ప్రయాణాలు చేస్తారు. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.

చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతుంటారు.