
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఆ శక్తి అక్కడ నివసించే వారి జీవితం మీద మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపవచ్చు. సమయానికి ప్రతీక అయిన గడియారం కూడా ఇందులో ఎంతో ముఖ్యమైనది. చాలామంది వాస్తు నియమాలను పట్టించుకోకుండా గడియారాన్ని ఏ గోడపైనైనా తగిలిస్తారు. కానీ ఇలా చేయడం వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. సరైన దిశలో ఉంచిన గడియారం అయితే ఇంట్లో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సును పెంచుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం కాలానికి, నిరంతర కదలికకు ప్రతీక. ఇది ఇంటి లోపల ఉన్న శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన స్థానం, దిశలో గడియారం ఉంచితే జీవితం సాఫీగా సాగి పురోగతి కలుగుతుంది. కానీ తప్పు దిశలో ఉంచితే ఆలస్యం, అవకాశాల నష్టం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
వాస్తు ప్రకారం ఉత్తర, తూర్పు దిశలు గడియారం ఉంచడానికి అత్యంత శుభప్రదమైనవి.
వాస్తు ప్రకారం గుండ్రని లేదా చతురస్రాకార గడియారాలు ఉత్తమం. ఇవి స్థిరత్వం, సమతుల్యతను సూచిస్తాయి. ముదురు రంగులైన నలుపు లేదా డార్క్ బ్లూ గడియారాలను సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది. వాటి బదులుగా తెలుపు, లేత నీలం లేదా మెటాలిక్ రంగుల గడియారాలు సానుకూల శక్తిని పెంచుతాయి. అలాగే గడియారం శుభ్రంగా, పగుళ్లు లేకుండా ఉండటం కూడా ఎంతో ముఖ్యము.. ఇది జీవితంలో స్పష్టత, సానుకూల మార్పులకు సూచనగా ఉంటుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)