Telugu Astrology: గ్రహ బలంతో విజయ యోగం.. శత్రువులపై ఈ రాశుల వారిదే పైచేయి..!

వృత్తి, ఉద్యోగం, వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది పెట్టే శత్రువులు, విరోధుల ప్రభావం కొన్ని రాశుల వారికి నవంబర్‌లోపు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. శని, గురు గ్రహాల అనుకూల సంచారం కారణంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, కుంభ రాశుల వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు. వీరు పోటీలు, వివాదాల్లో విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Telugu Astrology: గ్రహ బలంతో విజయ యోగం.. శత్రువులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
Telugu Astrology

Edited By:

Updated on: Jun 27, 2026 | 3:54 PM

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, వ్యక్తిగత జీవితంలో కూడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విరోధులు, పోటీదార్ల వల్ల కలిగే సమస్యలు వర్ణనాతీతంగా ఉంటాయి. అనేక రూపాల్లో అనేక విధాలుగా పీడించే ఈ విరోధులు, శత్రువుల గురించి ఆరవ స్థానాన్ని, ఆరవ స్థానాధిపతిని బట్టి తెలుసుకోవలసి ఉంటుంది. జాతక చక్రం లేదా గ్రహ సంచారంలో శని, గురు గ్రహాల స్థితిగతులు అనుకూలంగా ఉంటే శత్రు బాధ చాలావరకు తగ్గుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, కుంభ రాశులవారు ఇటువంటి శత్రువుల మీద నవంబర్ లోపు పైచేయి సాధించే అవకాశం ఉంది.

మేష‌ం

ఈ రాశికి షష్ట స్థానాధిపతి అయిన బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కలవడం వల్ల ఈ రాశివారికి ఏ రంగంలో అయినా, ఏ వృత్తిలో అయినా విరోధులు కాస్తంత ఎక్కువగానే ఉంటారు. ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం వల్ల వీరికి రహస్య శత్రువుల సమస్య కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరు గట్టి పోటీనిస్తుంటారు. ప్రస్తుతానికి గురు, రాహువులు అనుకూలంగా ఉన్నందువల్ల విరోధులు, పోటీదార్లు, రహస్య శత్రువుల మీద పైచేయి సాధించడం జరుగుతుంది.

వృషభం

ఈ రాశికి షష్టాధిపతి అయిన శుక్రుడు అయినందువల్ల సాధారణంగా ఈ రాశివారికి బాగా సన్ని హితులే విరోధులుగా మారి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుంటారు. ఇందులో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కూడా ఉండే అవకాశం ఉంది. విరోధుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయితే, ఈ శుక్రుడు తృతీయ స్థానంలో గురు, బుధులతో కలవడం, లాభ స్థానంలో శని సంచారం వల్ల వీరు ఇటువంటి విరోధుల మీద విజయం సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

ఈ రాశికి రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరిని విరోధుల సమస్య ఒక పట్టాన వదిలిపెట్టే అవకాశం ఉండదు. వీరిని చూసి అసూయపడేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సహోద్యోగుల వల్ల బాగా ఇబ్బందిపడే అవకాశముంది. బంధుమిత్రుల్లో కూడా వీరికి విరోధులుంటారు. నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం ఉంది. శత్రు స్థానాధిపతి అయిన గురు గ్రహం ఈ రాశిలో ప్రస్తుతం ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల వీరిని శత్రువులు, విరోధులు ఎక్కువగా దెబ్బతీసే అవకాశం ఉండకపోవచ్చు.

కన్య

ఈ రాశికి ఆరవ స్థానాధిపతి శని అయినందువల్ల సహచరులు, రక్త సంబంధీకులే ఎక్కువగా విరోధులుగా మారుతుంటారు. ముఖాముఖీ శత్రుత్వాలకు అవకాశం ఉండదు కానీ, కుట్రలు, కుతంత్రాల ద్వారా దెబ్బతీయడానికి అవకాశం ఉంది. కుజుడితో పాటు, గురువు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల విరోధుల మీద వీరిదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల్లో కొందరు రహస్య శత్రువులుగా మారే అవకాశం ఉంది. వీరిని దెబ్బతీయడం విరోధులకు అసాధ్యంగా మారవచ్చు.

తుల

ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి గురువు అయినందు వల్ల శేయోభిలాషుల ముసుగులో వీరికి విరోధులు చుట్టుపక్కలే ఉంటారు. వీరిని చూసి అసూయపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొందరు మిత్రులు కూడా అపకారం తలపెట్టడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అడుగడుగునా ఆటంకాలు సృష్టించేవారుంటారు. షష్టాధిపతి గురువు దశమంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, షష్ట స్థానంలో శని సంచారం వల్ల వీరు విరోధుల మీద పైచేయి సాధిస్తారు.

కుంభం

ఈ రాశికి చంద్రుడు షష్టాధిపతి అయినందువల్ల ఈ రాశివారికి తాత్కాలిక విరోధులే తప్ప శాశ్వత విరోధులు ఉండే అవకాశం లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు వీరిని మధ్య మధ్య ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంటుంది. శ్రమపడే తత్వం, సాత్విక వైఖరి ఈ అసూయా ద్వేషాలకు కారణం అవుతుంటుంది. షష్ట స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి కారణంగా వీరికి మరో నాలుగు నెలల పాటు శత్రు సమస్యలు, విరోధులు ఉండకపోవచ్చు.

Also Read: జూలైలో వారికి డబ్బే డబ్బు..! మీ రాశి ఉందేమో చూసుకోండి!

Follow Us