Sun Transit: ఈ నెల 15న మిథునరాశిలో సూర్యుడి సంచారం.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే.. విద్యార్థులకు ఒక వరం..

|

Jun 11, 2023 | 9:58 AM

బృహస్పతి పునర్వసు నక్షత్రంలో సూర్యుని సంచార సమయంలో.. పోటీ పరీక్షల ఫలితాల కోసం లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు జూన్ 24 నుంచి జూలై 8 వరకు శుభవార్త వినే అవకాశం ఉంది.

Sun Transit: ఈ నెల 15న మిథునరాశిలో సూర్యుడి సంచారం.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే.. విద్యార్థులకు ఒక వరం..
Surya Gochar 2023
Follow us on

ఈ నెల 15న మిథునరాశిలో సూర్యుని సంచరించనున్నాడు. దీంతో మేష రాశి వారికి దైర్యం, బలం కలుగుతుంది. ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఈ రాశివారికి బద్ధకం తగ్గి ప్రతి పని చురుకుదనంతో చేస్తారు. విజయం కోసం చేసే ప్రయత్నాలను కొనసాగిస్తారు. వ్యాపారం, ఉద్యోగాలలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దానిలో కూడా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన పనులపై ఆసక్తి కూడా పెరుగుతుంది. మనస్సు మతపరమైన పనులలో నిమగ్నమై ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి పునర్వసు నక్షత్రంలో సూర్యుని సంచార సమయంలో.. పోటీ పరీక్షల ఫలితాల కోసం లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు జూన్ 24 నుంచి జూలై 8 వరకు శుభవార్త వినే అవకాశం ఉంది.

ఈ సమయం విద్యార్థులకు, వైద్య రంగానికి సంబంధించిన వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.    తెలివితేటలు పెరుగుతాయి. సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ప్రభుత్వ పని లేదా ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంటేషన్ పెండింగ్‌లో ఉంటే ఆ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ రాశి ఆటగాళ్ళు , క్రీడల వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల కష్టానికి తగిన ఫలాలను అనేక రెట్లు అందుకుంటారు. అదే సమయంలో రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.. కనుక అప్పు తీసుకునే   ప్రయత్నాలను వేగవంతం చేయండి. కోరిక నెరవేరుతుంది.

ఈ రాశి పిల్లలు తమ ఆలోచనలను తండ్రితో పంచుకుంటే పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో తండ్రి సూచనలను పాటించండి లాభాలను పొందుతారు. తమ్ముళ్ల సహకారంతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు మారుతుంది. అర్ద నక్షత్రంలో సూర్యుని సంచారం గ్రహణ యోగం వంటి ఫలితాలను ఇస్తుంది. ఇది మేషరాశి వారికి మూడవ భాగంలో సూర్యుడు సంచరించడం వల్ల ఫలప్రదం అవుతుంది.

ఇవి కూడా చదవండి

పరిహారం: ప్రతి మంగళవారం హనుమంతుడిని దర్శించి, నెయ్యి దీపం వెలిగించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).