
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..
ఆదాయం-11, వ్యయం-5 | రాజపూజ్యం-2, అవమానం-6
పంచమ స్థానంలో శనీశ్వరుడు, జూన్ నుంచి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితివల్ల ఈ సంవత్సరమంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంది. రాశ్యధిపతి కుజుడు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవహారాలుః ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండి, దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చ గలుగుతారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆదాయ మార్గాలను వృద్ధి చేసుకోవడం మంచిది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
వృత్తి, ఉద్యోగాలుః ఈ రాశివారికి ఈ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యోగదాయకమైన, లాభసాటి అయిన ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా కొన్ని శుభవార్తలు వినడం, ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. చేపట్టిన వ్యవహారాలు మిత్రుల సహా యంతో పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశముంది.
కుటుంబ వ్యవహారాలుః ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవు తాయి. జీవిత భాగస్వామికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. కుటుంబ సమస్యలను పరిష్కరించడం మీదా, కుటుంబ సభ్యులు స్థిరపడడం మీదా శ్రద్ద పెడతారు.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..