Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందంటే..?

Ugadi 2026 Panchangam Dhanussu Rashi Phalalu: రాశ్యాధిపతి గురువు ఉచ్ఛ స్థితి వల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి, రాహువు అనుకూలతతో ఈ రాశి వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. అయితే మే తర్వాత గురు అష్టమ సంచారం కారణంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా పిత్రార్జితం కలిసి రావడం, ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం జరుగుతుంది. షేర్లు, పెట్టుబడులు లాభిస్తాయి. కానీ జూలై–ఆగస్టులో ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందంటే..?
Ugadi 2026 Panchangam Dhanussu Rashi Phalalu

Edited By:

Updated on: Mar 18, 2026 | 6:40 PM

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. 

ఆదాయం-14, వ్యయం-11 | రాజపూజ్యం-5, అవమానం-6

రాశ్యధిపతి గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల అర్ధాష్టమ శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. తృతీయ స్థానంలో ఉన్న రాహువు వల్ల జీవితంలో అన్ని అంశాల్లోనూ ఆశించిన పురోగతి ఉంటుంది. మే నెలాఖరు నుంచి అష్టమంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఎక్కువగా ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

ఆర్థిక వ్యవహారాలుః పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశముంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులుపెట్టే అవకాశం ఉంది. వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల జూలై, ఆగస్టు నెలల్లో కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే సూచనలున్నాయి. పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది.

వృత్తి, ఉద్యోగాలుః విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు అక్కడే స్థిరపడే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు తమ కృషిలో సఫలం కావడం జరుగుతుంది. భాగ్య స్థానంలో కేతు సంచారం వల్ల విదేశీ అవకాశాలు వృద్ధి చెందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపా రాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్య తలు అప్పగిస్తారు.

కుటుంబ వ్యవహారాలుః మధ్య మధ్య కుటుంబ సమస్యలు, గృహ, వాహన సమస్యలు ఉండ వచ్చు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

Follow Us