Dream Astrology: కలలో మండుతున్న అగ్ని కనిపించిందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇవి గొప్ప శుభ సంకేతాలు!

Fire Dream Meaning: ప్రతిరోజూ కలలో మండుతున్న అగ్ని కనిపిస్తుందా? స్వప్న శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం ఇది భయపడాల్సిన విషయం కాకపోవచ్చు. అంతర్గత బలం, ఆత్మవిశ్వాసం, కొత్త ప్రారంభం, పదోన్నతి, నాయకత్వ అవకాశాలకు ఇది శుభ సంకేతంగా భావిస్తారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Dream Astrology: కలలో మండుతున్న అగ్ని కనిపించిందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇవి గొప్ప శుభ సంకేతాలు!
Fire Dream Meaning

Updated on: Jul 15, 2026 | 3:23 PM

కలలు కేవలం రాత్రిపూట మనసులో మెదిలే ఊహలు మాత్రమే కావు. స్వప్న శాస్త్రం ప్రకారం, అవి మన అంతరంగ భావాలు, ఆలోచనలు, ఆశలు, భయాలకు ప్రతిబింబాలుగా భావిస్తారు. కొన్నిసార్లు ఒకే రకమైన కల పదేపదే రావడం జీవితంలో జరగబోయే మార్పులకు సంకేతంగా కూడా భావిస్తారు. అలాంటి కలల్లో ఒకటి మండుతున్న అగ్ని కనిపించడం. స్వప్న శాస్త్రం, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ప్రశాంతంగా మండుతున్న అగ్ని కనిపించడం చాలా సందర్భాల్లో శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే అగ్ని విధ్వంసం సృష్టిస్తున్నట్లు కనిపిస్తే దానికి భిన్నమైన అర్థాలు ఉండవచ్చు.

పెరిగే అంతర్గత శక్తి.. సమాజంలో గౌరవం

జ్యోతిష్య శాస్త్రంలో అగ్నికి అంగారకుడు (కుజుడు), సూర్యుడు ప్రతీకలుగా భావిస్తారు. కలలో ఎర్రటి అగ్ని కనిపిస్తే అది కుజుడి ప్రభావాన్ని, బంగారు లేదా పసుపు రంగు అగ్ని కనిపిస్తే సూర్యుడి అనుగ్రహాన్ని సూచిస్తుందని చెబుతారు. ఇలాంటి కల పదేపదే వస్తుంటే, మీలోని సామర్థ్యాలు వెలుగులోకి వచ్చే సమయం దగ్గరపడిందని నమ్ముతారు. మీరు చేసే పనులకు గుర్తింపు లభించడం, సమాజంలో గౌరవం పెరగడం, వ్యక్తిత్వానికి మంచి పేరు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది.

ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి

కుజుడు ధైర్యానికి, సూర్యుడు ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా జ్యోతిష్యంలో చెబుతారు. అందువల్ల కలలో ప్రశాంతంగా మండుతున్న అగ్ని కనిపించడం వల్ల మీలో దాగి ఉన్న భయాలు తొలగి, కొత్త అవకాశాలను స్వీకరించే ధైర్యం పెరుగుతుందని విశ్వసిస్తారు. ఇది వ్యక్తిగత జీవితం, ఉద్యోగం లేదా వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయం దగ్గరపడిందనే సంకేతంగా కూడా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది

అగ్నికి విధ్వంసం చేసే శక్తి ఉన్నప్పటికీ, అది పవిత్రత, శుద్ధి, పునర్జన్మకు కూడా ప్రతీకగా భావించబడుతుంది. అగ్ని ప్రశాంతంగా మండుతున్నట్లు కనిపిస్తే.. పాత సమస్యలు ముగిసి, కొత్త అవకాశాలు ప్రారంభమయ్యే సూచనగా చెబుతారు. అగ్ని విధ్వంసం సృష్టిస్తున్నట్లు లేదా ఎవరో కావాలనే నిప్పు పెడుతున్నట్లు కనిపిస్తే.. అది జీవితంలో కొన్ని సవాళ్లు లేదా ప్రతికూల పరిస్థితులను సూచిస్తుందని స్వప్న శాస్త్రంలో పేర్కొంటారు.

నాయకత్వం, పదోన్నతి అవకాశాలు

కలలో ప్రకాశవంతమైన పసుపు లేదా బంగారు రంగు అగ్ని కనిపిస్తే, అది సూర్యుని ప్రభావానికి సంకేతంగా భావిస్తారు. సూర్యుడు అధికారం, నాయకత్వం, కీర్తికి కారక గ్రహంగా పరిగణించబడతాడు. ఈ కల కనిపించిన వారికి: ఉద్యోగంలో పదోన్నతి లేదా కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉందని, వ్యాపారంలో నిర్ణయాధికార స్థానం పొందవచ్చని, సామాజిక లేదా రాజకీయ రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు, గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి.

(Disclaimer: ఈ సమాచారం స్వప్న శాస్త్రం, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉండవచ్చు. కలల అర్థాలు వ్యక్తిగత పరిస్థితులు, మానసిక స్థితి, అనుభవాలను బట్టి మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us