Rahu Ketu Blessings: రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!

2026 డిసెంబరు 5న రాహు–కేతువుల రాశి మార్పు ఉంటుంది. దీని కంటే ముందు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వృషభం, సింహం, తుల, ధనుస్సు రాశుల వారికి కెరీర్, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, ఆస్తి వంటి విషయాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Rahu Ketu Blessings: రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
Rahu Ketu Blessings

Updated on: Sep 22, 2026 | 7:25 PM

జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాల రాశి మార్పు వ్యక్తి జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నమ్మకాలు చెబుతున్నాయి. 2026 సంవత్సరం చివరిలో రాహు, కేతువులు రాశి మారనున్నారు. డిసెంబర్ 5న రాహు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి, కేతువు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నారు. అయితే ఈ రాశి మార్పుకు ముందు వరకు కొన్ని రాశుల వారికి రాహు-కేతువుల ప్రభావం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి వంటి విషయాల్లో పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. ఈ అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం..

వృషభ రాశి

డిసెంబరు 5న రాహు, కేతుల రాశి మార్పు వరకు వృషభ రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కెరీర్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న మార్పులు లేదా అవకాశాలు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త డీల్స్ కుదిరే అవకాశం ఉంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఇక ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన పాత వ్యవహారాల్లో కూడా ముందడుగు పడే అవకాశం ఉంది. ఆర్థికంగా కొత్త ఆదాయ అవకాశాలు మెరుగుపడుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయం కొత్త అవకాశాలను తీసుకురావచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. చాలాకాలంగా నెరవేరని కొన్ని కోరికలు నెరవేరే పరిస్థితులు ఏర్పడుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. కోరుకున్న ఉద్యోగం దక్కే అవకాశముంది. ఆస్తి సంబంధిత విషయాల్లో పురోగతికి అవకాశముంది. కెరీర్‌లో ముందుకు సాగడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తులా రాశి

తుల రాశి వారికి ఆస్తి కొనుగోలుకు సంబంధించిన కొన్ని మంచి అవకాశాలు రావచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలికలోకి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం ఆశించిన ఫలితాలు సాధించడానికి క్రమశిక్షణతో కృషి చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి తమ ప్రతిభను చాటుకునే అవకాశాలు లభిస్తాయి. దీంతో పేరు, గుర్తింపు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో ఉద్యోగ, కెరీర్ పరంగా కొత్త అవకాశాలు పొందుతారు. ఉద్యోగులు చేస్తున్న పనిని ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశముంది. సీనియర్లు, సహచరుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. కెరీర్‌కు సంబంధించి సరైన మార్గదర్శకత్వం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి కొత్త అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత సంబంధాల్లో పరస్పర నమ్మకం, ఆకర్షణ పెరిగే అవకాశముంది.

(గమనిక: ఇక్కడ పేర్కొన్న ఫలితాలు జ్యోతిష్య శాస్త్రంలోని సాధారణ అంచనాలు, విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఉంటాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, భుక్తులు తదితర అంశాల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు)

Loading...
Unable to load recommendations.
Follow Us