Ketu Transit 2023: కన్యారాశిలోకి కేతువు ప్రవేశం.. ఈ రాశులవారి జీవితాల్లో కనక వర్షమే.. మీ రాశి కూడా ఉందా.?

|

Jun 23, 2023 | 1:22 PM

Ketu Transit 2023: వైదిక జ్యోతిష్యశాస్త్రంలో కేతు గ్రహానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలను పీడించే దుష్టగ్రహంగా ప్రసిద్ధి గావించిన కేతువు ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తున్నాడు. అయితే అక్టోబర్ 30న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో..

Ketu Transit 2023: కన్యారాశిలోకి కేతువు ప్రవేశం.. ఈ రాశులవారి జీవితాల్లో కనక వర్షమే.. మీ రాశి కూడా ఉందా.?
Ketu Transit 2023
Follow us on

Ketu Transit 2023: వైదిక జ్యోతిష్యశాస్త్రంలో కేతు గ్రహానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలను పీడించే దుష్టగ్రహంగా ప్రసిద్ధి గావించిన కేతువు ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తున్నాడు. అయితే అక్టోబర్ 30న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితికదలికలు మానవ జీవితంపై పెను మార్పులను తీసుకువస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో కేతు గ్రహ కన్యారాశి సంచారం రాశిచక్రంలో కొన్ని రాశులపై అదృష్టంగా మారనుంది. ఈ సమయంలో ఆయా రాశులకు చెందినవారి జీవితం అద్వితీయంగా మెరిసిపోతుంది. ధనప్రవాహాన్ని చూస్తారు. అసలు కేతు గ్రహం ఏయే రాశులకు అదృష్ణ దేవతగా మారబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహరాశి: కన్యారాశిలో కేతుగ్రహ సంచారం సింహ రాశివారికి కూడా కలిసి వచ్చేదిగా ఉందని చెప్పకోవాలి. ఈ సమయంలో మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురిలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. తగిన ఫలితాలను అందుకోగలుగుతారు.

ధనస్సు రాశి: కేతువు గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల  ధనస్సురాశి జాతక చక్రం కలిగినవారికి అన్ని విషయాల్లోనూ శుభఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇది విద్యార్థులకు, ఉద్యోగులకు అందివచ్చే కాలంగా ఉంటుంది. అలాగే వ్యాపారులు, రైతులు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: కేతు గ్రహ కన్యారాశి సంచారం వృషభరాశి జాతకులకు సానుకూలంగా ఉండనుంది. ఈ సమయంలో వృషభ రాశివారికి ఆకస్మిక ధన, లాభాలు కలుగుతాయి. ఇంకా ఆర్థికంగా నిలదొక్కుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).