Numerology: పుట్టిన తేదీతో మీ జీవిత భాగస్వామి స్వభావం తెలిసిపోతుంది..!

పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి స్వభావాన్ని తెలుసుకోవచ్చని న్యూమరాలజీలో చెబుతారు. ముఖ్యంగా మూలాంకం ద్వారా మీ పార్ట్‌నర్ ప్రేమ, సంబంధాలు, ఆలోచనా విధానం, ప్రవర్తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చు. మీ పార్ట్‌నర్ పుట్టిన తేదీ ఏ మూలాంకానికి చెందుతుందో తెలుసుకుని వారి స్వభావం గురించి తెలుసుకోండి.

Numerology: పుట్టిన తేదీతో మీ జీవిత భాగస్వామి స్వభావం తెలిసిపోతుంది..!
Numerology

Updated on: Sep 23, 2026 | 3:34 PM

మన పుట్టిన తేదీ మన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, ప్రవర్తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తుందని న్యూమరాలజీ చెబుతోంది. పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే మూలాంకం ద్వారా వ్యక్తి స్వభావంతో పాటు ప్రేమ, వివాహం, సంబంధాల్లో వారి ప్రవర్తనకు సంబంధించిన కొన్ని సంకేతాలను తెలుసుకోవచ్చని న్యూమరాలజీ నిపుణులు చెబుతారు. మీ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ ఏదో తెలుసుకుంటే.. ఆ తేదీకి సంబంధించిన మూలాంకాన్ని లెక్కించి వారి స్వభావం గురించి తెలుసుకోవచ్చు.

మూలాంకం 1

పుట్టిన తేదీలు: 1, 10, 19, 28

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 1. మూలాంకం 1కి సూర్యుడు అధిపతిగా భావిస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు ఆత్మవిశ్వాసంతో, చురుకుగా, నాయకత్వ లక్షణాలతో ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. సంబంధాల్లో బాధ్యత తీసుకోవడానికి ముందుంటారు. తమ పార్ట్‌నర్ పట్ల కేర్ తీసుకోవడంతో పాటు అవసరమైనప్పుడు తానే ముందు చొరవ తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మూలాంకం 2

పుట్టిన తేదీలు: 2, 11, 20, 29

మూలాంకం 2 చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంఖ్యకు చెందిన వారు సున్నితమైన మనస్తత్వం, ప్రేమ, ఆప్యాయత కలిగి ఉంటారు. ప్రేమ సంబంధాల్లో భావోద్వేగ అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పార్ట్‌నర్ నుంచి ప్రేమ, అర్థం చేసుకోవడం, ఆప్యాయతను కోరుకుంటారు.

మూలాంకం 3

పుట్టిన తేదీలు: 3, 12, 21, 30

మూలాంకం 3కి గురు గ్రహం అధిపతి భావిస్తారు. ఈ సంఖ్యకు చెందిన వారు సరదాగా, సృజనాత్మకంగా, కలుపుగోలుగా ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. తమ భావాలను పార్ట్‌నర్‌తో బహిరంగంగా పంచుకోవడానికి ఇష్టపడతారు. ప్రేమగా మాట్లాడేవారు, తమను అర్థం చేసుకునే పార్ట్‌నర్ ఉంటే సంబంధానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు.

మూలాంకం 4

పుట్టిన తేదీలు: 4, 13, 22, 31

మూలాంకం 4కు కేతువుతో సంబంధం ఉందని భావిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టపడి పనిచేసే, స్థిరమైన ఆలోచనలు కలిగిన, నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. ఎవరినైనా వెంటనే నమ్మరు. సంబంధంలో పూర్తిగా కలిసిపోవడానికి కొంత సమయం తీసుకుంటారు. అయితే ఒకసారి నమ్మకం ఏర్పడితే సంబంధాన్ని నిజాయితీగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు.

మూలాంకం 5

పుట్టిన తేదీలు: 5, 14, 23

మూలాంకం 5కి బుధుడు అధిపతిగా భావిస్తారు. ఈ సంఖ్యకు చెందిన వారు కొత్త విషయాలు నేర్చుకోవడం, ప్రయాణాలు, సాహసాలను ఇష్టపడతారని న్యూమరాలజీ చెబుతోంది. సంబంధాల్లో కూడా స్వేచ్ఛను కోరుకుంటారు. ఒకే విధమైన రొటీన్ వారికి త్వరగా విసుగు కలిగించే అవకాశముంది. అందుకే పార్ట్‌నర్ నుంచి కొంత వ్యక్తిగత స్పేస్ లభిస్తే సంతోషంగా ఉంటారని భావిస్తారు.

మూలాంకం 6

పుట్టిన తేదీలు: 6, 15, 24

మూలాంకం 6కు శుక్రుడు అధిపతిగా చెబుతారు. ప్రేమ, అందం, కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందని న్యూమరాలజీలో భావిస్తారు. ప్రేమ సంబంధాల్లో రొమాన్స్, ఆప్యాయతకు ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబం, ఇల్లు, బంధాలకు కూడా ఎక్కువ విలువ ఇస్తారు.

మూలాంకం 7

పుట్టిన తేదీలు: 7, 16, 25

మూలాంకం 7కు చెందిన వారు కొంత రహస్యమైన, ఆలోచనాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటారని చెబుతారు. తమ మనసులోని ప్రతి విషయాన్ని వెంటనే ఇతరులతో పంచుకోరు. ప్రేమలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఒంటరిగా ఉండేందుకు లేదా వ్యక్తిగత సమయం గడిపేందుకు ఇష్టపడుతారు.

మూలాంకం 8

పుట్టిన తేదీలు: 8, 17, 26

మూలాంకం 8కు శని అధిపతిగా భావిస్తారు. ఈ సంఖ్యకు చెందిన వారు గంభీరంగా, బాధ్యతాయుతంగా, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. ప్రారంభంలో కొంత కఠినంగా కనిపించినప్పటికీ, ఒకసారి నమ్మకం ఏర్పడితే సంబంధాన్ని బాధ్యతగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు.

మూలాంకం 9

పుట్టిన తేదీలు: 9, 18, 27

మూలాంకం 9కు కుజుడు అధిపతిగా భావిస్తారు. ఈ సంఖ్యకు చెందిన వారు ఉత్సాహంగా, ధైర్యంగా, పట్టుదలతో ఉంటారని చెబుతారు. తమ పార్ట్‌నర్‌ను గాఢంగా ప్రేమిస్తారు. వారి అవసరాల్లో అండగా నిలిచేందుకు ముందుంటారని న్యూమరాలజీలో పేర్కొన్నారు.

గమనిక: ఈ కథనంలోని న్యూమరాలజీ వివరాలు సాధారణ నమ్మకాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా పరిగణించకూడదు. ముఖ్యమైన వ్యక్తిగత నిర్ణయాలను వీటి ఆధారంగా మాత్రమే తీసుకోకండి.

Loading...
Unable to load recommendations.
Follow Us