Money Astrology
ఈ నెల 18న శుక్ర గ్రహం వృశ్చిక రాశి నుంచి ధనూ రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు శుక్రుడి మీద శనీశ్వరుడి దశమ దృష్టి పడి, శని ప్రభావానికి లోను కావడం జరిగింది. శని ప్రభావం వల్ల శుక్రుడికి పాపత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు ధనూ రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల ఇది శని ప్రభావం నుంచి బయటపడి, శుభ గ్రహమైన గురువు ప్రభావానికి లోనయింది. గురు గ్రహ దృష్టి పడడం వల్ల శుక్రుడు కూడా ఎక్కువగా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. ధనూ రాశిలో మరో శుభ గ్రహమైన బుధుడితో కూడా కలవడం వల్ల శుక్రుడు కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అదృష్టాలు పట్టించడం జరుగుతుంది. శుక్రుడు గురువుకు చెందిన ధనూ రాశిలో ప్రవేశించడం, దాని మీద గురువు దృష్టి కూడా పడడం వల్ల ఆరు రాశుల వారిలో ధనాశ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
- మేషం: ఈ రాశిలోని గురువు భాగ్య స్థానంలో ఉన్న బుధ, శుక్రులను వీక్షించడం వల్ల ఈ రాశివారికి అన్ని విధాలుగానూ ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఒక నెల రోజుల పాటు పట్టుకుంటే బంగారం అన్నట్టుగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము కూడా తప్పకుండా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
- మిథునం: ఈ రాశివారికి సప్తమంలో బుధ, శుక్రులు కలవడం వల్ల స్త్రీమూలక ధన లాభానికి అవకాశం ఉంది. సంపన్న యువతితో ప్రేమలో పడే సూచనలు కూడా ఉన్నాయి. సతీమణికి జీత భత్యాలు పెరగడం కానీ, ఆమె తరఫున ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉండడం గానీ జరుగుతుంది. తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరగడం జరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది.
- సింహం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి అధ్వాన స్థితిలో ఉన్న వ్యక్తులైనా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. కుటుంబపరంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరమైన ప్రయ త్నాలన్నీ సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభా లను సృష్టిస్తాయి. మీ ప్రతిభకు సర్వత్రా గుర్తింపు లభిస్తుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి.
- తుల: ఈ రాశికి మూడవ స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలవడం వల్ల ఆర్థిక ప్రయత్నాలు విస్తృతం అవు తాయి. ఆర్థిక పురోగతికి కుటుంబ సభ్యుల నుంచి ఇతోధికంగా సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. మొత్తం మీద అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఆక స్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక సంబంధంగా మనసులోని కోరికలు చాలావరకు నెర వే రుతాయి. సోదరులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశిలోనే శుక్ర, బుధుల యుతి జరగడం, దాన్ని పంచమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఆర్థికంగా మహా యోగం పట్టే అవకాశం ఉంది. అనేక మార్గాలలో ధన సంపాదనకు అవకాశం ఉంది. ప్రేమలు, పెళ్లిళ్లు కూడా ధన లాభంతో ముడిపడి ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించి ధన లాభం పెరుగుతుంది. సంపన్న వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది.
- కుంభం: ఈ రాశివారికి లాభ స్థానంలో బుధ, శుక్రులు కలవడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. స్త్రీమూలక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తుంది. షేర్లు, లాటరీలు, ఆర్థిక లావాదేవీలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.